Sailesh Kolanu : ‘ఏంటో అంతా సరికొత్తగా’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన శైలేష్ కొలను..
డైరెక్టర్ శైలేష్ కొలను తజహా ఏంటో అంతా సరికొత్తగా అనే ప్రేమకథా సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. (Sailesh Kolanu)
Sailesh Kolanu
Sailesh Kolanu : డైరెక్టర్ శైలేష్ కొలను తజహా ఏంటో అంతా సరికొత్తగా అనే ప్రేమకథా సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. రాము ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాము ఎం నిర్మాణంలో రాజ్ బోను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఫస్ట్ లుక్ లాంచ్ అనంతరం శైలేష్ కొలను మాట్లాడుతూ.. పోస్టర్ చూడగానే ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. టైటిల్ కూడా కొత్తగా, ఆకర్షణీయంగా ఉంది. ఈ సినిమా కొత్త కంటెంట్ తో మంచి ప్రయత్నం చేస్తుంది. రాజ్ బోను గారు దర్శకత్వం వహించడం ఆసక్తికరంగా ఉంది. ఆయన కథ చెప్పే విధానం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమా విజయం సాధించాలి అని అన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ యూనిట్ తెలిపింది.
