Harudu : ఒకప్పటి హీరో వెంకట్.. రీ ఎంట్రీ సినిమా ‘హరుడు’ ట్రైలర్ చూశారా..?

మీరు కూడా హరుడు ట్రైలర్ చూసేయండి.. (Harudu)

  • Published On : April 12, 2026 / 10:55 AM IST

Harudu

Harudu : శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి.. పలు సినిమాలతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న వెంకట్ మధ్యలో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ OG సినిమాలో గెస్ట్ రోల్ చేసి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వెంకట్ హరుడు అనే సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో వెంకట్ హీరోగా మాస్ కమర్శియల్ ఎంటర్టైనర్ గా ‘హరుడు’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హెబ్బపటేల్ , సలోని , నాటషా ,అలీ,సుమన్,రవి వర్మ, సుభాశ్రీ.. పలువురు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా మే 8న రిలీజ్ కానుంది.

Also See : Sai Kamakshi Bhaskarla : ‘డెకాయిట్’ వర్కింగ్స్ స్టిల్స్ షేర్ చేసిన సాయి కామాక్షి భాస్కర్ల..

మీరు కూడా హరుడు ట్రైలర్ చూసేయండి..

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో వెంకట్ మాట్లాడుతూ.. హరుడు సినిమా పూర్తి చేయడానికి యాక్టింగ్‌తో పాటు నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్‌ను గోవాలో షూట్ చేశాం ఆ పాట చాలా బాగా వచ్చింది. రిలీజ్ తర్వాత అది ఇంకా హిట్ అవుతుంది. గోవా, ముంబైలో పాటలు షూట్ చేసాం. హైదరాబాద్ మాస్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. నన్ను ఈ సినిమాలో యాక్షన్ హీరోలా చూపించారు. ఇది మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమా అవుతుంది అని అన్నారు.

Also See : Yash Rangineni : విరోష్ పెళ్లి వేడుకల్లో సందడి చేసిన విజయ్ మేనమామ.. నిర్మాత యశ్ రంగినేని స్పెషల్ ఫోటోలు..

డైరెక్టర్ రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం వెంకట్ ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ముంబైలో ఐదు రోజుల షూటింగ్ చాలా మంచి అనుభవం అని అన్నారు.

కమెడియన్ అలీ మాట్లాడుతూ.. వెంకట్‌తో ‘సీతారామ కళ్యాణం’ సినిమా నుంచి పరిచయం ఉంది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆయన నిర్మించిన ఒక సినిమాలో కూడా నేను నటించాను. అన్ని భాషల్లో సినిమాలు చేసిన వెంకట్ ఇప్పుడు హరుడుతో రీ ఎన్టీస్ర్య్ ఇస్తున్నారు. డైరెక్టర్ రాజ్ తాళ్లూరి పూరి జగన్నాథ్ దగ్గర పని చేశారు. సినిమాలో ఆ మార్క్ కనిపిస్తోంది అని అన్నారు.