Venkatesh announced Saindhav teaser release date
Saindhav : హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ తన 75వ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘సైంధవ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని తెరకెక్కిస్తూనే ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ వచ్చారు చిత్ర యూనిట్. ఈక్రమంలోనే సినిమాలో నటించే ముఖ్యమైన యాక్టర్స్ అందర్నీ పరిచయం చేశారు. ఇప్పుడు ప్రమోషన్స్ లో మరింత జోరుని పెంచబోతున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ మూవీ టీం అప్డేట్ ఇచ్చింది.
వెంకటేష్ చేతిలో మెషిన్ గన్ పట్టుకున్న ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. టీజర్ ని అక్టోబర్ 16న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే కచ్చితమైన టైం అయితే చెప్పలేదు. వెంకటేష్ నుంచి ఒక యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. దీంతో ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఇది వెంకీ 75వ సినిమా అవ్వడం ఇంకో విశేషం. ఈ మూవీ క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ మూవీని పోస్టుపోన్ చేశారు.
Also read : Kannappa : మంచు విష్ణు కన్నప్పలో మరో స్టార్ హీరో ఎంట్రీ.. ఎవరో తెలుసా..?
#SAINDHAV Teaser on Oct 16th❤️?#SaindhavOnJAN13th @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @tkishore555 @maniDop #Venky75 pic.twitter.com/qFaro9lnWh
— Venkatesh Daggubati (@VenkyMama) October 12, 2023
ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలుపుతూ జనవరి 13న కలుదామంటూ వెంకటేష్ అభిమానులకు తెలియజేశాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. తదితరులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.