గ్రాండ్‌గా ఆశ్రిత ఎంగేజ్‌మెంట్

దగ్గుబాటి ఇంట త్వరలో పెళ్ళి బాజా మోగనుంది.

  • Publish Date - February 8, 2019 / 11:11 AM IST

దగ్గుబాటి ఇంట త్వరలో పెళ్ళి బాజా మోగనుంది.

దగ్గుబాటి ఇంట త్వరలో పెళ్ళి బాజా మోగనుంది. విక్టరీ వెంకటేష్, నీరజ దంపతుల పెద్ద కూతురు ఆశ్రిత మ్యారేజ్.. హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో జరగనుంది. ఫిబ్రవరి 6న వెంకటేష్ ఇంట్లో రిలేటివ్స్, ఫ్రెండ్స్ సమక్షంలో ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరగింది. ఈ ఫంక్షన్‌కి సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకి రాలేదు. ఆశ్రితది లవ్ మ్యారేజ్ అని తెలుస్తుంది. మార్చి 1న వివాహం జరుగుతుంది.

తర్వాత రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఎరైంజ్ చెయ్యబోతున్నారు. ఈ రిసెప్షన్‌కి టాలీవుడ్ నుండే కాకుండా మిగతా ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు కూడా అటెండ్ అవుతారని తెలుస్తుంది. ఆశ్రిత ప్రొఫెషనల్ బేకర్ కమ్ ఫుడ్ బ్లాగర్. పెళ్ళి తర్వాతే వెంకటేష్ వెంకీమామ షూట్‌లో పాల్గొంటాడు.