Saindhav : ‘హార్ట్ ఆఫ్ సైంధవ్‌’ని పరిచయం చేసిన వెంకటేష్.. కథ మొత్తం ఈ పాత్ర చుట్టే..!

వెంకటేష్ తన తన 75వ మూవీగా 'సైంధవ్‌'ని రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుతూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేస్తూ వస్తున్నారు మూవీ టీం. ఈ క్రమంలోనే..

Venkatesh introduce heart of Saindhav character

Saindhav : విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రస్తుతం తన మైల్ స్టోన్ మూవీని సిద్ధం చేస్తున్నాడు. తన 75వ మూవీగా ‘సైంధవ్‌’ అనే టైటిల్ తో ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇక ఈ మూవీని ‘హిట్’ వంటి క్రైమ్ సిరీస్ తో ఆకట్టుకున్న శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోనే ఆడియన్స్ లో మంచి బుజ్ ని క్రియేట్ చేసింది. ఆ వీడియోలో వెంకటేష్ ని మిషన్ గన్స్ తో చూపించి సినిమా యాక్షన్ థ్రిల్లర్ అని తెలియజేశాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా జరుగుతుంది.

Rahul Ramakrishna : ప్రియదర్శిని అలా కంపేర్ చేసి అగౌరవ పరచొద్దు.. బెస్ట్ ఫ్రెండ్ గురించి రాహుల్ పోస్ట్..

ఇక ఒక పక్క షూటింగ్ జరుపుతూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేస్తూ వస్తున్నారు మూవీ టీం. ఈ క్రమంలోనే మూవీలో నటించే ఒకో పాత్రని పరిచయం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో నటించే అందాల భామలని పరిచయం చేశారు. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇక బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలోని మెయిన్ పాత్రని వెంకటేష్ పరిచయం చేశాడు. ‘హార్ట్ ఆఫ్ సైంధవ్‌’ అంటూ గాయత్రీ పాప క్యారెక్టర్ ని పరిచయం చేశాడు.

Baby Movie : అదిరిపోయిన ‘బేబీ’ కలెక్షన్స్.. ఫుల్ ప్రాఫిట్స్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు తెలుసా?

బేబీ సారా ఈ సినిమాలో వెంకటేష్ కూతురిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కూతుర్ని కాపాడుకునే పాత్రలో వెంకటేష్ మెడికల్ మాఫియాతో యుద్ధం చేయబోతున్నట్లు సమాచారం. దీంతో మూవీ యాక్షన్ మాత్రమే కాదు ఆడియన్స్ మనసుని కరిగించే ఎమోషన్ కూడా ఉండబోతుంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. వెంకీ మామ నుంచి ఒక పక్కా యాక్షన్ థ్రిల్లర్ వచ్చి చాలా కాలం అయ్యింది. దీంతో ఈ మూవీ పై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు