Sankranthiki Vasthunam : బాబోయ్.. సంక్రాంతి ప్రమోషన్స్ లో వెంకీమామ హవా.. అందర్నీ మించి.. ఈ స్పెషల్ ఇంటర్వ్యూ చూశారా?

ఈ మధ్య కాలంలో ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుకున్నంతగా ఇంకే సినిమా గురించి మాట్లాడుకోలేదు.

Venkatesh Sankranthiki Vasthunnam Movie Doing Unique Promotions Watch Latest Special Interview here

Sankranthiki Vasthunam : వెంకటేష్ సంక్రాంతి పండక్కి జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అయితే ప్రమోషన్స్ లో మాత్రం ఈ సినిమా సంక్రాంతికి రానున్న వేరే సినిమాలను దాటడమే కాదు ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.

Also Read : Sukriti Veni : సుకుమార్ కూతురి ఫస్ట్ సినిమా.. థియేటర్స్ లో రిలీజ్ ఎప్పుడంటే..

ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, రెండు సాంగ్స్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్స్ అయితే పెద్ద హిట్ అయి ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం చాలా కొత్తగా చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ కంటే ప్రమోషనల్ కంటెంట్ ఎక్కువ. ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఈ ప్రమోషన్స్ ఉంటున్నాయి.

పోస్టర్స్ లో కొత్తదనం, వెంకటేష్ నేను సాంగ్ పాడతాను అని అనిల్ రావిపూడిని ఏడిపించే వీడియో, అరకులో పిల్లలతో వెంకటేష్ వీడియో, అరకులో అనిల్ రావిపూడి సినిమా కోసం ఫ్యాన్స్ గోల, క్యారెక్టర్స్ తో ప్రెస్ మీట్ పెట్టడం, మీడియాతో ప్రశ్నలు అడిగించకుండా కథలు చెప్పించడం, బయట ఈవెంట్స్ కి వెళ్లి స్వయంగా వెంకిమామ డ్యాన్స్ చేయడం.. ఇలా రకరకాల ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచారు.

ఇప్పుడైతే ఏకంగా న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేసారు. ఈ ఇంటర్వ్యూలో దిల్ రాజు ఘర్షణలో వెంకటేష్ లాగా, అనిల్ రావిపూడి జయం మనదేరాలో వెంకటేష్ లాగా, ఐశ్వర్య రాజేష్ చంటిలో వెంకటేష్ లాగా, మీనాక్షి బొబ్బిలి రాజాలో వెంకటేష్ లాగా గెటప్స్ వేసుకొచ్చి వెంకటేష్ ని ఇమిటేట్ చేస్తూ ఫుల్ సందడి చేసారు. దీంతో ఈ ఇంటర్వ్యూ ట్రెండ్ అవుతుంది.

Also Read : Shiva Rajkumar : క్యాన్సర్ నుంచి కోలుకున్న స్టార్ హీరో.. భయపడ్డాను అంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసి..

ఈ మధ్య కాలంలో ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుకున్నంతగా ఇంకే సినిమా గురించి మాట్లాడుకోలేదు. అంతలా కొత్త కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రమోషన్స్ వెనక ఎవరున్నారో కానీ వాళ్ళని మాత్రం పొగిడేస్తున్నారు విక్టరీ ఫ్యాన్స్. సంక్రాంతికి వస్తున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజు సినిమాలకు ఇంకా పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం జనాల్లో ఫుల్ గా రీచ్ అయిపోయింది. ఈ సినిమాతో వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిట్ కొట్టేస్తాడని అంతా ఫిక్స్ అయ్యారు.

తాజాగా వెంకటేష్ ని ఇమిటేట్ చేస్తూ చేసిన ఇంటర్వ్యూని మీరు కూడా చూసేయండి..