Shiva Rajkumar : క్యాన్సర్ నుంచి కోలుకున్న స్టార్ హీరో.. భయపడ్డాను అంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసి..

తనకు క్యాన్సర్ నయమైందంటూ తన భార్యతో కలిసి ఓ వీడియోని పోస్ట్ చేసారు శివరాజ్ కుమార్.

Shiva Rajkumar : క్యాన్సర్ నుంచి కోలుకున్న స్టార్ హీరో.. భయపడ్డాను అంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసి..

Shiva Rajkumar says he Recovered from Cancer Video goes Viral

Updated On : January 1, 2025 / 3:54 PM IST

Shiva Rajkumar : చాలా మంది సినీ సెలబ్రిటీలు గతంలో క్యాన్సర్ తో పోరాడి బతికిన వాళ్ళు ఉన్నారు. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ చేరారు. గత కొంతకాలంగా బ్లాడర్ క్యాన్సర్ తో బాధపడుతున్న శివరాజ్ కుమార్ ఓ పది రోజుల క్రితం క్యాన్సర్ సర్జరీకి అమెరికా వెళ్లారు. తాజాగా తనకు క్యాన్సర్ నయమైందంటూ తన భార్యతో కలిసి ఓ వీడియోని పోస్ట్ చేసారు శివరాజ్ కుమార్.

Also Read : 7/G Brindavan Colony 2 : 7/G బృందావన కాలనీ సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

శివరాజ్ కుమార్, ఆయన భార్య గీత కలిసి షేర్ చేసిన వీడియోలో గీత మాట్లాడుతూ.. మీ ప్రార్థనలతో శివరాజ్ కుమార్ రిపోర్ట్స్ లో నెగిటివ్ వచ్చింది. డాక్టర్లు క్యాన్సర్ నయమైందని అధికారికంగా చెప్పారు. మీ బ్లెస్సింగ్స్ కి ధన్యవాదాలు అని తెలిపారు.

అలాగే శివన్న మాట్లాడుతూ.. క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే ఎవరైనా భయపడతారు. నేను కూడా భయపడ్డాను. కానీ ఆ భయం తగ్గడానికి నా భార్య, నా స్నేహితులు, కుటుంబం, ఫ్యాన్స్ ఎంతో సహకరించారు. ఓ వైపు కీమో థెరపీ చేయించుకుంటూనే నా సినిమా షూటింగ్ పూర్తిచేశాను. వైద్యులు నాకు ఎంతగానో సహకరించారు. ఇప్పుడు క్యాన్సర్ నుంచి కోలుకున్నాను. త్వరలో పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ డ్యాన్సులు, ఫైట్స్ చేస్తాను అని తెలిపారు.

శివన్న క్యాన్సర్ జయించాడని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా మరింత కోలుకొని పూర్తి ఆరోగ్యంతో వచ్చి సినిమాలు చేయాలని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Ram Charan : బాలయ్య షోలో రామ్ చరణ్ వేసుకొచ్చిన హుడీ ధర ఎంతో తెలుసా?