7/G Brindavan Colony 2 : 7/G బృందావన కాలనీ సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
7G బృందావన కాలనీ సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతుంది.

7/G Brindavan Colony Sequel Shooting in Progress First Look Released
7/G Brindavan Colony2 : రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2004లో వచ్చిన తమిళ్ సినిమా 7/G రెయిన్ బో కాలనీ అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఈ సినిమా తెలుగులో 7G బృందావన కాలనీగా డబ్బింగ్ తో రిలీజయి ఇక్కడ కూడా భారీ విజయం సాధించి క్లాసిక్ సినిమాలా నిలిచింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ కూడా బాగా పాపులర్ అయి ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి.
Also Read : Ram Charan : బాలయ్య షోలో రామ్ చరణ్ వేసుకొచ్చిన హుడీ ధర ఎంతో తెలుసా?
7G బృందావన కాలనీ సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. ఇటీవలే ఈ సినిమా రీ రిలీజ్ కూడా అయింది. గతంలో పలుమార్లు నిర్మాత, దర్శకుడు ఈ సీక్వెల్ గురించి మాట్లాడారు. అయితే నేడు న్యూ ఇయర్ సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేసారు. సైలెంట్ గా 7G బృందావన కాలనీ 2 సినిమా షూటింగ్ కూడా చేసేస్తున్నారు. ఇప్పటికే చాలా శాతం షూటింగ్ పూర్తయినట్టు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎఎం. రత్నం నిర్మాణంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ హీరోగానే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ సోనియా అగర్వాల్ చనిపోయినట్టు చూపించారు కాబట్టి పార్ట్ 2 లో మరో హీరోయిన్ ని తీసుకున్నారు. ఈ సీక్వెల్ లో అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే జయరామ్, సుమన్ శెట్టి, సుధ.. లాంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Here it is
7/G Rainbow colony 2 first look @thisisysr@AMRathnamOfl @ramji_ragebe1 pic.twitter.com/HB3CflZtsb— selvaraghavan (@selvaraghavan) January 1, 2025
ఇక ఫస్ట్ పార్ట్ కి అద్భుతమైన పాటలు ఇచ్చిన యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు కూడా సంగీతం ఇవ్వనున్నారు. 7G బృందావన కాలనీ ఇప్పటి ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది మరి సీక్వెల్ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
Also Read : SSMB 29 : రాజమౌళి-మహేశ్‌బాబు సినిమా రేపే మొదలు?