Ram Charan : బాలయ్య షోలో రామ్ చరణ్ వేసుకొచ్చిన హుడీ ధర ఎంతో తెలుసా?
నిన్న అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఈ ఎపిసోడ్ కి రామ్ చరణ్ తో పాటు చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ శర్వానంద్, నిర్మాత విక్రమ్ రెడ్డి వచ్చారు.

Balakrishna Unstoppable Show Ram Charan Wearing Hoodie Cost goes Viral
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో సంక్రాంతికి జనవరి 10న గేమ్ ఛేంజర్ సినిమాతో రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ఫుల్ ట్రెండ్ అయి వైరల్ అయ్యాయి. గేమ్ ఛేంజర్ ట్రైలర్ జనవరి 2న రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు.
Also Read : SSMB 29 : రాజమౌళి-మహేశ్‌బాబు సినిమా రేపే మొదలు?
నిన్న అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఈ ఎపిసోడ్ కి రామ్ చరణ్ తో పాటు చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ శర్వానంద్, నిర్మాత విక్రమ్ రెడ్డి వచ్చారు. ఈ షూటింగ్ ఫోటోలు ఇప్పటికే బయటకు వచ్చి వైరల్ గా మారాయి. అయితే ఈ షోలో రామ్ చరణ్ వేసుకొచ్చిన హుడీ బాగా వైరల్ అయింది. బ్లాక్ కలర్ తో చేతుల మీద వైట్, రెడ్ కలర్స్ డిజైన్ తో ఉన్న ఈ హుడీ గురించి ఫ్యాన్స్ తెగ వెతికారు.
చరణ్ వేసుకొచ్చిన ఈ హుడీ కాస్ట్ చూసి ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగానే సెలబ్రిటీలు వేసుకొచ్చే బ్రాండెడ్ బట్టలు, షూస్, వాచ్ లు.. చాలా కాస్ట్లీ ఉంటాయి. ఈ క్రమంలోనే చరణ్ ధరించిన అమిరి బ్రాండ్ హుడీ ధర అసలు ధర ఒక లక్ష 10 వేలకు పైగా ఉండగా డిస్కౌంట్ లో 88 వేలకు వస్తుంది ఆన్లైన్లో. దీంతో ఈ ధర చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.
మొత్తానికి రామ్ చరణ్ హుడీ బాగానే వైరల్ అవుతుంది. హుడీ మాత్రమే కాదు లుక్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. RC16 సినిమాలో ఇదే లుక్స్ తో కనపడనున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమాతో రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా అయింది.
Also See : Anasuya Bharadwaj : బాబోయ్.. న్యూ ఇయర్ కి బీచ్ లో హాట్ ఫోజులతో వెల్కమ్ చెప్పిన అనసూయ..