SSMB 29 : రాజమౌళి-మహేశ్‌బాబు సినిమా రేపే మొదలు?
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

Mahesh Babu Rajamouli movie pooja Ceremony on jan 2nd
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మహేశ్ కెరీర్‌లో ఈ చిత్రం 29వ సినిమాగా రానుంది. ఇటు మహేశ్, అటు రాజమౌళి కెరీర్‌లోనే అత్యధిక భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దర్శకుడు రాజమౌళి కొంతకాలంగా లొకేషన్స్ వేటలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆఫ్రికా అడవుల్లో పర్యటించారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలోని పలు ప్రాంతాలను పరిశీలించారు.
అందుతున్న సమాచారం ప్రచారం లొకేషన్ల వేట పూరైనట్లు తెలుస్తోంది. రేపు అనగా జనవరి 2న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమం జరగనుంది.
Hit 3 : నాని సినిమా షూటింగ్‌లో విషాదం.. మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి
ఈ నెల చివరి వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
యాక్షన్ అడ్వెంచర్ ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో రచయిత విజేంద్రప్రసాద్ మాట్లాడుతూ భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని ఓ సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ చిత్రంతో ఆవిష్కరించనున్నారని చెప్పారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
Unstoppable With NBK : అన్‌స్టాపబుల్‌లో ప్రభాస్‌కి కాల్ చేసిన చరణ్.. రెబల్ స్టార్ రివేంజ్..?