Sankranthiki Vasthunnam Collections : ‘సంక్రాంతికి వస్తున్నాం’ అయిదు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు.. బాలయ్య సినిమాని దాటేసిందిగా..

సినిమా రిలీజయిన మొదటి రోజు మొదటి ఆట నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి.

Venkatesh Sankranthiki Vasthunnam Movie Five Days Collections Details

Sankranthiki Vasthunnam Collections : వెంకటేష్ ఈ సంక్రాంతి పండక్కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లు నవ్వులు పూయిస్తూ ఫ్యామిలీలను ఆకట్టుకుంటూ పెద్ద విజయం సాధించింది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, మురళీధర్ గౌడ్, నరేష్, అవసరాల శ్రీనివాస్, చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్, శ్రీనివాస రెడ్డి.. ఇలా చాలామంది నటీనటులు ప్రేక్షకులను తమ నటనతో ఫుల్ గా నవ్విస్తున్నారు.

Also Read : Varun Tej : వరుణ్ తేజ్ బర్త్ డే.. కొత్త సినిమా అనౌన్స్.. కొరియాలో హారర్ కామెడీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

సినిమా రిలీజయిన మొదటి రోజు మొదటి ఆట నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి రోజు 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి వెంకిమామ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఐదు రోజుల్లో నిన్నటితో 161 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్.

ఈజీగా ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని సమాచారం. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటికే బాలయ్య డాకు మహారాజ్ కలెక్షన్స్ ని కూడా దాటేసింది. బాలయ్య డాకు మహారాజ్ సినిమా 150 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. మరోవైపు అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ తో అదరగొడుతుంది. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా 1.8 మిలియన్ డాలర్స్ వసూలు చేసి 2 మిలియన్ డాలర్స్ వైపు పరుగులు పెడుతుంది. నేడు ఆదివారం కావడంతో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

 

Also Read : Saif Ali Khan Attack Case: సైఫ్‌పై దాడికేసులో అసలైన నిందితుడు అరెస్ట్.. ఎక్కడ పట్టుబడ్డాడంటే..