Saif Ali Khan Attack Case: సైఫ్‌పై దాడికేసులో అసలైన నిందితుడు అరెస్ట్.. ఎక్కడ పట్టుబడ్డాడంటే..

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

Saif Ali Khan Attack Case: సైఫ్‌పై దాడికేసులో అసలైన నిందితుడు అరెస్ట్.. ఎక్కడ పట్టుబడ్డాడంటే..

Saif Ali Khan Attack Case

Updated On : January 19, 2025 / 8:02 AM IST

Saif Ali Khan Attack Case: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్థరాత్రి సమయంలో థానేలోని హిరానంది ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హీరానంది ఎస్టేట్ సమీపంలోని లేబర్ క్యాంప్ వద్ద తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికివెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరును మహ్మద్ అలియాస్ గా గుర్తించారు. పట్టుబడిన తరువాత సైఫ్ ఇంట్లోకి చొరబడి దాడి చేసింది తానేనని పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు. అయితే, ఘటన తరువాత నిందితుడు తన పేరును విజయ్ దాస్ గా మార్చుకొని తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడ్ని బాంద్రాకు తరలించి విచారిస్తున్నారు. అయితే, ఇవాళ ఉదయం 9గంటల ప్రాంతంలో ముంబయి డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడిస్తారని తెలుస్తుంది.

Also Read: Saif Ali Khan Stabbing Case : వాడు వీడేనా? సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో మరొకరు అరెస్ట్..

సైఫ్ అలీఖాన్ దాడి కేసుకు సంబంధించి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇంతకుముందు నిందితుడిని పోలిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి. దుర్గ్ రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, విచారణ అనంతరం అతడు అసలైన నిందితుడు కాదని పోలీసులు తెలిపారు. అంతకుముందు.. ముంబైకి చెందిన ఓ వ్యక్తిని దాడికేసులో అనుమానితుడిగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి బాంద్రా పోలీసు స్టేషన్ కు తరలించారు. అయితే, విచారణ అనంతరం అతడు నిందితుడు కాదని నిర్ధారించి విడుదల చేశారు.

తాజాగా.. శనివారం అర్థరాత్రి సమయంలో థానేలోని హీరానందానీ ఎస్టేట్ సమీప ప్రాంతంలో తలదాచుకున్న అసలైన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి దాడిచేసింది నేనే అని  నిందితుడు ఒప్పుకున్నాడని ముంబై పోలీసులు తెలిపారు. నిందితుడు విజయ్ దాస్ ఓ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి చొరబడినట్లు పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకున్నట్లు సమాచారం.

Also Read: Saif Ali Khan : సైఫ్‌ అలీఖాన్‌ దాడి ఘటనతో అలజడి

జనవరి 16వ తేదీన తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బాంద్రాలోని సద్గురు శరణ్ భవనంలోని 11వ అంతస్తులో ఉన్న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి నిందితుడు చొరబడ్డాడు. సైప్, కరీనాకపూర్ చిన్న కుమారుడు గదిలోకి చొరబడ్డాడు. అక్కడ ఉన్న కేర్ టేకర్ ను డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించి దాడికి యత్నించాడు. ఈ క్రమంలో సైఫ్ అలీఖాన్ అక్కడకు చేరుకొని దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు సైఫ్ పై ఆరుసార్లు కత్తితో దాడిచేసి పారిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ ను ఆటోలో ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.

 

సైఫ్ అలీఖాన్ కు శస్త్రచికిత్స చేసిన వైద్యులు అతని వెన్నుభాగంలో ఇరుక్కుపోయిన కత్తి ముక్కను బయటకు తీశారు. పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ సర్జరీకూడా చేశారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ క్షేమంగానే ఉన్నాడు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఉన్న సైఫ్.. రెండుమూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఇదిలాఉంటే.. ఈ కేసులో పోలీసులు పలువురిని విచారించారు. సైఫ్ అలీఖాన్ భార్య, నటి కరీనాకపూర్ వాంగ్మూలాన్ని కూడా ముంబై పోలీసులు నమోదు చేశారు.


#WATCH | Mumbai, Maharashtra | Saif Ali Khan attack case | The arrested accused has been kept in detention at Khar Police Station. Visuals from outside the police station. pic.twitter.com/J1rMYhjUbD