అడ్డదిడ్డంగా కారు నడిపిన 12వ తరగతి విద్యార్థి.. రోడ్డుపై ఆరేళ్ల బాలుడి మృతి, పలువురికి గాయాలు
వేగంగా వచ్చిన స్విఫ్ట్ కారు హనుమాన్ ఆలయం సమీపంలో ముందుగా ఆటోరిక్షాను ఢీకొట్టి, రోడ్డుపై నడుస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.
- లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం
- పాదచారులపైకి దూసుకెళ్లిన కారు
- 12వ తరగతి విద్యార్థి అరెస్ట్
Lucknow: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంతరా ప్రాంతంలో ఓ 12వ తరగతి విద్యార్థి అడ్డదిడ్డంగా కారునడిపి పాదచారులపైకి దూసుకెళ్లాడు. దీంతో ఆరేళ్ల బాలుడు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.
ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన స్విఫ్ట్ కారు హనుమాన్ ఆలయం సమీపంలో ముందుగా ఆటోరిక్షాను ఢీకొట్టి, రోడ్డుపై నడుస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.
Also Read: జగన్ నా దేవుడు.. ఉదయం నిద్ర లేవగానే ఆయన ఫొటోకి దండం పెట్టుకుంటా: జయమంగళ వెంకటరమణ
గాయపడిన వారిని అర్మాన్ (12), అవధ్ బిహారి (42), సాధనా వర్మ (35), మీనా దేవి (60)గా గుర్తించారు. మృతి చెందిన ఆరేళ్ల చిన్నారి పేరు దిక్షాంత్ పటేల్ అని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే దీక్షాంత్ను వైద్య కేంద్రానికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
కారుతో ఢీకొట్టిన 12వ తరగతి విద్యార్థి పేరు గౌరభ్ సింగ్ అని, అతడికి 21 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ప్రాణాలకు ప్రమాదం కలిగించడం వంటి ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గౌరభ్ సింగ్ ఫేర్వెల్ పార్టీ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ కారు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.
