Venky Atluri : ఏమయ్యా వెంకీ.. ఇంక తెలుగు హీరోలతో సినిమా చేయవా..?
ఇప్పుడు వరుసపెట్టి బయటి హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు వెంకీ అట్లూరి.(Venky Atluri)
- Saketh U
- Published on- August 1, 2026 / 07:14 AM IST
Venky Atluri
Venky Atluri : ఈ డైరెక్టర్ పక్కా తెలుగువాడు. టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్నాడు. వరసగా హిట్లు కొడుతున్నాడు. కానీ హీరోలు మాత్రం తెలుగువాళ్లు కాదు. ముందు మొదటి మూడు సినిమాలు తెలుగు హీరోలతోనే చేసాడు. ఆ సినిమాలు కూడా పర్వాలేదు అనిపించాడు. కానీ ఇప్పుడు వరుసపెట్టి బయటి హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు వెంకీ అట్లూరి.
చూడ్డానికి సింపుల్ గా కామ్ గా కనిపిస్తాడు కానీ పెద్దగా హడావిడి లేకుండా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్లతో రీసౌండ్ చేస్తున్న వెంకీ అట్లూరి టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు సౌత్ మొత్తం మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్. అందుకే వెంటపడి వెంకీయే కావాలని ఇక్కడికొచ్చి సినిమాలు చేస్తున్నారు పక్క రాష్ట్రాల హీరోలు.
Also Read : Rajmouli : మాకు నమ్మకం లేదు దొర.. రాజమౌళి మహేష్ బాబు సినిమాపై ఫ్యాన్స్ కూడా..
వెంకీ అట్లూరి మొదటి సినిమా వరుణ్ తేజ్ తో తొలిప్రేమ పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే యావరేజ్ గా మిగిలాయి. దాంతో తన స్టైల్ మార్చదు. సర్ సినిమా ధనుష్ తో చేసి అటు తమిళ్, ఇటు తెలుగులో హిట్ కొట్టాడు. వెంటనే మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమా చేసి హిట్ కొట్టడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా సాధించాడు.
ఇప్పుడు మల్లి తమిళ హీరో సూర్య తో విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమా చేస్తున్నాడు. వెంకీతో సినిమా అంటే గ్యారంటీ హిట్ అనే సర్టిఫికెట్ సంపాదించుకున్న ఈ యంగ్ డైరెక్టర్ కంటెంట్ డ్రివెన్ సినిమాలతోనే హిట్లు కొడుతున్నారు. అందుకే ఒకసారి వెంకీతోసినిమా చేసిన పక్క రాష్ట్రాల హీరోలు పరిగెత్తుకుంటూ మళ్లీ వెంకీ దగ్గరకే వస్తున్నారు. విశ్వనాధ్ అండ్ సన్స్ తర్వాత కూడా వెంకీ తెలుగు హీరోలతో కాకుండా తమిళ్, మలయాళ హీరోలతోనే కమిటయ్యారు.
Also See : Allu Family : స్పైడర్ మ్యాన్ షోలో సందడి చేసిన అల్లు ఫ్యామిలీ.. ఫొటోలు..
సూర్యతో సినిమా ఆగస్ట్ 14న థియేటర్లోకొస్తోంది. ఈ సినిమా తర్వాత వెంకీ ఏ తెలుగు హీరోతో సినిమా చేస్తారా అని వెయిట్ చేస్తుంటే దుల్కర్ సల్మాన్ తో చేసిన లక్కీభాస్కర్ కి సీక్వెల్ రెడీ అవుతోందని చెప్పి షాక్ ఇచ్చాడు. అది కాకుండా ధనుశ్ కి ఒక స్టోరీ చెప్పాను, అది ఆయనకు నచ్చింది, దానిపై వర్క్ చేస్తున్నాను అని తెలిపాడు. ధనుష్ కూడా వెంకీతో ఇంకో సినిమా ఉంటుందని ఇటీవల కర సినిమా ఈవెంట్లో తెలిపారు. మరో తమిళ హీరో కూడా వెంకీతో సినిమా చేయడానికి ఇష్టపడుతున్నాడని టాక్. అందుకే విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమా ప్రమోషన్స్ ఎక్కువగా తమిళనాడులోనే చేస్తూ అక్కడ కూడా వెంకీ ఫేమ్ తెచ్చుకుంటున్నాడు.
దుల్కర్, ధనుశ్ తో చేసిన రెండు సినిమాలు తెలుగుతో పాటు ఆ హీరో భాషలో కూడా మంచి హిట్ అయ్యాయి. దాంతో వీళ్లిద్దరూ రెండు మార్కెట్లను కవర్ చేస్కోవచ్చన్న ఉద్దేశంతో మళ్లీ వెంకీతోనే సినిమాకి రెడీ అవుతున్నారు. దాంతో వెంకీ అట్లూరి మళ్ళీ తెలుగు హీరోతో ఎప్పుడు సినిమా చేస్తాడో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఏది ఏమైనా మన తెలుగు హీరో అన్ని భాషల్లో, వేరే హీరోల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం గ్రేట్ అంటున్నారు.
