Venky Kudumula : ఫ్యాక్షనిస్ట్ 20 ఏళ్ళు జైలుకి వెళ్ళొస్తే.. మెగాస్టార్ తో సినిమాపై వెంకీ కుడుముల రియాక్షన్..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి సినిమా గురించి స్పందించాడు. (Venky Kudumula)

  • Published on- November 10, 2026 / 06:08 PM IST

Venky Kudumula

Venky Kudumula : ఛలో, భీష్మ సినిమాలతో వరుసగా రెండు మంచి విజయాలు సాధించాడు వెంకీ కుడుముల. కానీ ఆ తర్వాత రాబిన్ హుడ్ సినిమాతో ఫ్లాప్ చూసాడు. అయితే ఈ మధ్యలో వెంకీ కుడుముల దర్శకత్వంలో DVV బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా కూడా ప్రకటించారు. కానీ ఆ సినిమా ఆగిపోయింది.

వెంకీ కుడుముల ప్రస్తుతం ఇట్లు అర్జున సినిమాకు నిర్మాణ బాధ్యతలు వహించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి సినిమా గురించి స్పందించాడు.

Also Read : Rakesh Varre : మిర్చి సినిమా చేయనన్నాను.. బాహుబలిలో నా సీన్స్ మొత్తం ఎడిటింగ్ లో పోయాయి..

వెంకీ కుడుముల మాట్లాడుతూ.. ఒక రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ 20 ఏళ్ళు జైలులో ఉండి బయటకు వస్తే ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా, స్విగ్గీ, జొమాటో లాంటి ప్రపంచంలో ఎలా ఉంటాడు, ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాడు అని ఎంటర్టైనింగ్ గా కథ రాసుకున్నాను. చిరంజీవి గారికి కూడా ఈ కథ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగా వచ్చినా సెకండ్ హాఫ్ సరిగ్గా లేదు. నాకు కూడా సెకండ్ హాఫ్ ఎక్కడో బాగోలేదు అనిపించింది. అందుకే ఆ సినిమా ఆగిపోయింది. కానీ చిరంజీవి గారు ఇంకేదైనా కథ ఉంటే తీసుకురా, ఎప్పుడైనా సరే వచ్చి కథ చెప్పు నచ్చితే చేద్దాం అన్నారు అని తెలిపాడు.

ఫ్యాక్షనిస్ట్ 20 ఏళ్ళు జైలు నుంచి వచ్చాక ఎలా ఉంటాడు అని ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ వినడానికి బాగానే ఉన్నా మరి ఎందుకు వర్కౌట్ అవ్వలేదో. ఫ్యూచర్ లో వెంకీ కుడుములకు చిరంజీవితో సినిమా తీసే ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి.