Venu Swamy : ఎన్టీఆర్ కాబోయే సీఎం.. పవన్ కళ్యాణ్ మాత్రం.. మళ్ళీ జోస్యం చెప్పిన వేణుస్వామి..
జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అని కూడా చెప్పడం గమనార్హం. (Venu Swamy)
- Saketh U
- Updated on- July 8, 2026 / 01:02 PM IST
Venu swamy Comments On Ntr Pawan Kalyan
Venu Swamy : సెలబ్రిటీల మీద జోస్యం చెప్తూ, వారి జాతకాలు చెప్తూ రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తారు వేణుస్వామి. అప్పుడప్పుడు ఈయన చెప్పే జాతకాలతో వివాదాల్లో కూడా నిలుస్తాడు. తాజాగా మరోసారి మన సెలబ్రిటీలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
వేణుస్వామి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళు ఎలాంటివాళ్ళు? వాళ్ళు ఏమవుతారు అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అని కూడా చెప్పడం గమనార్హం.
Also Read – Sourav Ganguly : ‘దాదా’ సౌరవ్ గంగూలీ బయోపిక్.. ఫస్ట్ లుక్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..
వేణుస్వామి హోస్ట్ అడిగిన వారి గురించి చెప్తూ.. మోదీ.. కారణజన్ముడు, విజయ్ దేవరకొండ.. కష్టపడతాడు, ప్రభాస్.. కారణజన్ముడు, రేవంత్ రెడ్డి.. తెలంగాణ తోపు, కేసీఆర్.. తెలంగాణ జాతిపిత, చిరంజీవి.. కష్టంతో పైకి వచ్చిన కారణజన్ముడు, రామ్ చరణ్.. వంశాన్ని నమ్ముకోకుండా కష్టపడేవ్యక్తి, అనుష్క.. బ్యూటీ విత్ బ్రెయిన్, రాజమౌళి.. వందశాతం కారణజన్ముడు, మహేష్ బాబు.. అందగాడు, ఎన్టీఆర్.. యుగ పురుషుడు, జూనియర్ ఎన్టీఆర్.. కాబోయే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్.. పర్ఫెక్ట్ పొలిటీషియన్, చంద్రబాబు నాయుడు.. గొప్ప అడ్మినిస్ట్రేటర్, వైఎస్సార్.. శత్రువును కూడా క్షమించి ఆదుకునే గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ సీఎం అవుతారు, పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ పొలిటీషియన్ అని చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లో లేకపోయినా ఆయన ఫ్యాన్స్ ఎప్పటికైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని, సీఎం అవుతారని భావిస్తూ ఎన్టీఆర్ కనపడినప్పుడల్లా సీఎం సీఎం అంటూ అరుస్తారు. ఇప్పుడు వేణుస్వామి ఇలా చెప్పడంతో ఫ్యాన్స్ మరింత సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కామెంట్స్ వైరల్ చేస్తున్నారు.
