రియల్ లైఫ్ పేరుతో రీల్ లైఫ్ క్యారెక్టర్..

సూర్య చిత్రంలో ‘భక్త వత్సలం నాయుడు’ గా విలక్షణ నటుడు మోహన్ బాబు..

  • Publish Date - February 28, 2020 / 11:21 AM IST

సూర్య చిత్రంలో ‘భక్త వత్సలం నాయుడు’ గా విలక్షణ నటుడు మోహన్ బాబు..

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘సూరరై పోట్రు’ తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాలో విలక్షణ నటుడు మోహన్‌బాబు ముఖ్యపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అపర్ణా బాలమురళి కథానాయిక. ‘గురు’ ఫేమ్ సుధ కొంగర డైరెక్ట్ చేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రోమోస్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రంలో మోహన్ బాబు క్యారెక్టర్ నేమ్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర పేరు ‘భక్త వత్సలం నాయుడు’. ఇది ఆయన అసలు పేరు కావడం విశేషం. సినిమాల్లోకి వచ్చాకే మోహన్ బాబుగా పేరు మార్చుకున్నారు.  తన పాత్రకు తెలుగుతోపాటు, తమిళంలోనూ మోహన్‌బాబే డబ్బింగ్‌ చెప్పుకోవడం మరోవిశేషం. ఈ విషయాన్ని ఓ నెటిజన్‌ శుక్రవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. దీనిపై మంచు లక్ష్మీ స్పందించారు.

‘‘ఓహ్‌ నాన్న తన పుట్టిన పేరును సినిమాలో ఉపయోగించారని నాకు తెలియదు. యూనిఫామ్‌లో నాన్న ఎంత అందంగా ఉన్నాడో. మా నాన్న ఓ అద్భుతం.’’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం తమిళ్, తెలుగులో త్వరలో విడుదల కానుంది.