ప్రముఖ బాలీవుడ్ నటుడు కన్నుమూత

  • Publish Date - September 30, 2019 / 06:26 AM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు వీజూ ఖోటే (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (సెప్టెంబర్ 30, 2019)న ముంబైలో మరణించారు. ఆయన హిందీ, మరాఠీ భాషల్లో మొత్తం 300లకు పైగా సినిమాల్లో నటించారు. అంతేకాదు కాళీ, సోలీ పేర్లతో ఆయన పాపులర్‌గా నిలిచారు. 

ఇక  ఈ రోజు ఉదయం చందన్‌ వాడిలో అంత్యక్రియలు నిర్వహించనున్నామని ఆయన  మేనకోడలు నటుడు భవన బల్సవర్ ఒక ప్రకటనలో తెలిపారు. 1964 సంవత్సరంలో ‘యా మలక్’ సినిమాలో ఆయన చేసిన పాత్ర సినీ జివితాంలో పెద్ద మలుపు తిప్పింది.

అంతేకాదు షోలేలో డెకాయిట్‌ కాలియా పాత్రతో పాపులర్‌ అయిన విజు ‘అందాజ్‌ అప్నా అప్నా రాబర్ట్‌ పాత్రలో ఆకట్టుకున్నారు. అలాగే ‘ఖయామత్ సే ఖయామత్ తక్’, వెంటిలేటర్, జబాన్ సంభాల్కే లాంటి టీవీ షోలో కూడా నటించారు.