ప్రముఖ సినీ నటుడు, రచయిత రావి కొండల రావు కన్నుమూశారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో గుండెపోటుతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. సినీ రచయితగా, నటుడిగా రావి కొండల రావు ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1958లో ‘శోభ’ చిత్రంతో రావి కొండల రావు సినీ ప్రస్థానం మొదలైంది. అంతకుముందు ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేశారు.
600కు పైగా సినిమాల్లో నటించారు కొండల రావు. ‘తేనె మనసులు, దసరా బుల్లోడు, రంగూన్ రౌడి, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, రాధాగోపాళం, కింగ్, ఓయ్, వరుడు’ వంటి చిత్రాల్లో నటించారు. తమిళ్, మలయాళం సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. 2012లో ఆయన భార్య, ప్రముఖ నటి రాధ కుమారి కన్నుమూశారు. రావి కొండల రావు మరణ వార్త తెలియగానే సినీ రంగానికి చెందిన పలువురు నివాళులు అర్పిస్తున్నారు.