Aadarsha Kutumbam Trailer: ఫ్యామిలీ డ్రామాకు థ్రిల్లర్ టచ్.. ‘ఆదర్శ కుటుంబం AK 47’ ట్రైలర్ రిలీజ్.. మరోసారి వెంకీ-త్రివిక్రమ్ కాంబో రచ్చ

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం AK 47’(Aadarsha Kutumbam Trailer) పవర్‌ఫుల్ ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్.

Victory venkatesh trivikram srinivas adarsha kutumbam ak 47 movie trailer released

Aadarsha Kutumbam Trailer: టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం AK 47′(Aadarsha Kutumbam Trailer). అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ తాజాగా పవర్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో కథానాయికలుగా శ్రీనిధి శెట్టి, నివేతా థామస్ నటిస్తుండగా, వెంకటేష్‌ను సరికొత్త మేకోవర్‌లో చూపించ బోతున్నారు. ఎప్పటినుంచో ఈ కాంబినేషన్ కోసం కాచుక్కూర్చున్న అభిమానులకు ఈ ట్రైలర్ విజువల్స్ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.

Goddeti Madhavi: స్థానిక పోరులో సంచలనం.. జెడ్పీటీసీ బరిలో మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి నామినేషన్!

తాజాగా విడుదలైన ట్రైలర్ గమనిస్తే.. ఇది పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ కామెడీ మరియు హై-వోల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలగలిపిన అద్భుతమైన కథాంశంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ స్టైల్‌లో సాగే లోతైన, ఆలోచింపజేసే సంభాషణలు ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. “సైన్యం చావకుండా గెలిచే యుద్ధం ఏది సార్..”, “ఒక మనిషి మృగంలా మారడం అనేది ఒక ప్రాసెస్, ఒక ఎవల్యూషన్..” లాంటి విలక్షణమైన పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ భారీ చిత్రానికి సంగీత సంచలనం తమన్ ఎస్ స్వరాలను అందిస్తున్నారు. ట్రైలర్‌లో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్లో ఉంది. కుటుంబ ప్రేక్షకులను అలరించే ఎలిమెంట్స్ తోపాటు కమర్షియల్ హంగులను సమపాళ్లలో జోడించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అక్టోబర్ 30 కోసం వెంకీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంది అనేది చూడాలి.