Noble Book of World Recordలో మంచు మోహన్ బాబు మనవరాలు

Vidya Nirvana Manchu Anand : సినీ నటుడు, కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు మనవరాలు, మంచు లక్ష్మీ ప్రసన్న కుమార్తె విధ్యా నిర్వాణ మంచు ఆనంద్ అరుదైన ఘనత సాధించింది. యంగెస్ట్ చెస్ ట్రైనర్ (Youngest Chess Trainer) ‌గా నొబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు (Noble Book of World Record)ల్లో ప్లేస్ దక్కించుకుంది. శనివారం నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డా.చోకలింగం బాలాజీ సమక్షంలో దీనికి సంబంధించి పరీక్షలు జరిగాయి. ఈ ఎగ్జామ్‌లో విధ్యా నిర్వాణ అర్హత సాధించి..రికార్డు సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా మంచు లక్ష్మీ (Manchu Lakshmi Prasanna) సంతోషం వ్యక్తం చేశారు. ఇంత చిన్న వయస్సులోనే..యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా రికార్డు సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ రికార్డులో స్థానం సంపాదించినందుకు తాతగా గర్వ పడుతున్నానని మోహన్ బాబు (Dr. Mohan Babu) వెల్లడించారు. పిల్లలకు చదువుతో పాటు..దేనిమీద ఆసక్తి ఉందో దానిపై సమయం కొంత కేటాయించాలని తల్లిదండ్రులకు సూచించారాయన. తప్పకుండా..ప్రతొక్కరూ గొప్ప స్థాయికి చేరుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.