Nayanthara
Nayanthara : సెలబ్రిటీలు ఖరీదైన వస్తువులు కొంటారని తెలిసిందే. చాలా మంది సెలెబ్రిటీలు లగ్జరీ కార్స్ వాడుతుంటారు. తాజాగా నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త, డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఖరీదైన కార్ కొని గిఫ్ట్ గా ఇచ్చాడు.
కొత్త కార్ తో పాటు నయనతార ఫ్యామిలీ దిగిన ఫోటోని విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి భార్యకు స్పెషల్ గా బర్త్ డే శుభాకంక్షాలు తెలియచేసాడు. దీంతో ఈ కార్ ఇప్పుడు వైరల్ గా మారింది. కార్ ధర తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. విగ్నేష్ తన భార్య నయనతార కోసం రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్ట్రా మోడల్ కార్ కొనిచ్చాడు.
Also Read : Suma Kanakala : రిటైర్మెంట్ పై సుమ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్..
ఈ కార్ ధర దాదాపు 10 కోట్ల రూపాయలు. రోల్స్ రాయిస్ అంటేనే ఖరీదైన కార్లు అని తెలిసిందే. అందులో హై ఎండ్ మోడల్ కారుని ఏకంగా 10 కోట్లు పెట్టి కొని తన భార్యకు గిఫ్ట్ ఇచ్చాడు విగ్నేష్. దీంతో వామ్మో 10 కోట్లు పెట్టి బర్త్ డే కి కార్ కొన్నారా అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. కొత్త కార్ తో నయనతార ఫ్యామిలీ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇప్పటికే నయనతార దగ్గర BMW రెండు కార్లు, బెంజ్ రెండు కార్లు, ఫోర్డ్ ఒక కార్, టయోటా ఒక కార్ ఉన్నాయి. నయన్ కార్ లిస్ట్ లోకి ఇప్పుడు ఈ రోల్స్ రాయిస్ చేరింది.
Also See : Ram Pothineni : అబ్బా ఏమున్నాడ్రా బాబు.. చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని.. లేటెస్ట్ ఫొటోలు..