Vijay- Rashmika: విజయ్- రష్మిక హనీమూన్ వెకేషన్.. థాయ్‌లాండ్‌లో కొత్త జంట ఫొటోస్

విజయ్- రష్మిక(Vijay- Rashmika) థాయ్‌లాండ్‌ హనీమూన్ వెకేషన్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vijay and Rashmika Honeymoon Vacation Photos

Vijay- Rashmika: టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నల వివాహ వేడుకల సందడి ఇంకా తగ్గకముందే, వారి హనీమూన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో వీరి అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి హడావిడి ముగిసిన అనంతరం, ఈ కొత్త జంట తమ ఏకాంత సమయాన్ని ఆస్వాదించేందుకు థాయ్‌లాండ్‌లోని కో సముయి ద్వీపానికి వెళ్లారు.

Samantha: బాపు బొమ్మ లుక్ లో సమంత.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

సముద్ర తీరాన ప్రకృతి ఒడిలో ఉన్న ఒక ప్రైవేట్ విల్లాలో వీరు గడుపుతున్న మధుర క్షణాలకు సంబంధించిన ఒక రొమాంటిక్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో రష్మిక పసుపు రంగు ఫ్లోరల్ డ్రెస్‌లో మెరిసిపోతుండగా, విజయ్(Vijay- Rashmika) తనదైన స్టైలిష్ క్యాజువల్ లుక్‌లో కనిపించాడు. సాధారణంగా సెలబ్రిటీలు వెకేషన్స్ కోసం లగ్జరీ రిసార్టులను ఎంచుకుంటారు. కానీ ఈ జంట మాత్రం ప్రశాంతత కోసం పచ్చని చెట్ల మధ్య ఉన్న ప్రైవేట్ విల్లాను ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట, తిరిగి రాగానే తమ తమ పనులతో బిజీ కానున్నారు. రష్మిక తన తదుపరి చిత్రం ‘మైసా’ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా, విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబాలి’ అనే చిత్రంలో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మొత్తానికి ‘విరోష్’ జంట ఫోటోలు చూస్తుంటే వారు తమ కొత్త జీవితాన్ని ఎంతో సంతోషంగా ప్రారంభిస్తున్నట్లు కనిపిస్తోంది.