Vijay and Trisha seen together at a wedding
Vijay- Trisha: తమిళ స్టార్ విజయ్ విడాకుల విషయం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. ఆయన భార్య సంగీతం ఆయన నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. అయితే, ఆమె తన భర్తకు వేరే హీరోయిన్ తో సంబంధాలు ఉన్నాయని, అందుకే విడాకులు కోరుతున్నట్టుగా పిటీషన్ లో తెలిపింది సంగీతం. దాంతో, ఆ న్యూస్ సంచలంగా మారింది. అంతేకాదు, విజయ్ తో సంబంధం ఉన్న ఆ హీరోయిన్ ఎవరు అంటూ కూడా ఆరాలు తీయడం మొదలుపెట్టేశారు అంతా.
Dhurandhar 2: పోటీ నుంచి టాక్సిక్ అవుట్.. సింగల్ గా వస్తున్న దురంధర్.. ఇక రికార్డుల మోత కన్ఫర్మ్
ఈనేపథ్యంలోనే గత కొంతకాలంగా విజయ్- త్రిష పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ వార్తలకు బలం చేకూరుస్తు విజయ్- త్రిష(Vijay- Trisha) కూడా కలిసి కనిపించారు. దాంతో, ఈ ఇద్దరి పెళ్లి మ్యాటర్ నిజమే అంటూ వార్తలు వినిపించాయి. విజయ్ భార్య చేసిన కామెంట్స్ కూడా నిజమే అని అనుకున్నారు అంతా. కానీ, తాజాగా మరోసారి విజయ్- త్రిష కలిసి కనిపించి ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు.
విజయ భార్య విడాకులు కోరిన తరువాత విజయ్-త్రిష ఇద్దరు కలిసి ఒక పెళ్ళికి అటెండ్ అయ్యారు. గురువారం తమిళ నిర్మాతకు ఇంట్లో జరిగిన ఓ పెళ్ళిలో ఈ ఇద్దరు కలిసి కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. దీనికి సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఈ ఇద్దరి మధ్య రిలేషన్ నిజమే అని,. విడాకుల మ్యాటర్ తరువాత ఓపెన్ అయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే, విజయ్-త్రిష రిలేషన్ నిజమే అని అనిపిస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరి రిలేషన్ పై అధికారిక ప్రకనట వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.