Vijay Antony : చ‌డీచ‌ప్పుడు కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చిన విజ‌య్ ఆంటోనీ మూవీ

బిచ్చ‌గాడు మూవీతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు త‌మిళ న‌టుడు విజ‌య్ ఆంటోని.

Vijay Antony movie Mazhai Pidikkatha Manithan streaming in OTT

Mazhai Pidikkatha Manithan : బిచ్చ‌గాడు మూవీతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు త‌మిళ న‌టుడు విజ‌య్ ఆంటోని. అప్ప‌టి నుంచి ఆయ‌న న‌టించిన చిత్రాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల అవుతున్నాయి. విజ‌య్‌ న‌టించిన తాజా చిత్రం తుఫాన్‌(మళై పిడిక్కత మణితన్).

ఎలాంటి చ‌డీచ‌ప్పుడు కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఈ మూవీ తెలుగులో ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విజయ్‌ మిల్టన్ ద‌ర్శ‌క‌త్వంలో ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్‌ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్‌ బోరా నిర్మించారు.

KALKI 2898AD‌‌ : సంధ్య థియేట‌ర్‌లో క‌ల్కి 50 డేస్ సెల‌బ్రేష‌న్స్‌.. వీడియో వైర‌ల్‌

సత్యరాజ్, శరత్‌ కుమార్, మేఘా ఆకాష్, మురళీ శర్మ, డాలీ ధనుంజయ లు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప‌ర్వాలేద‌నిపించింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. ప్ర‌స్తుతం త‌మిళ వ‌ర్షెన్ మాత్ర‌మే ఓటీటీలో అందుబాటులోకి వ‌చ్చింది. తమిళంలో ఈ మూవీ ఆగ‌స్టు 2న విడుద‌ల చేశారు. వ‌చ్చేవారం నుంచి తెలుగులోనూ అందుబాటులోకి రానున్న‌ట్లుగా తెలుస్తోంది.