KALKI 2898AD : సంధ్య థియేటర్‌లో కల్కి 50 డేస్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD.

KALKI 2898AD 50 days Celebrations at Sandhya theatre
KALKI 2898AD 50 days Celebrations : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. 11 వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కాగా.. నిన్నటితో (ఆగస్టు 15)తో థియేటర్లలో విడుదలై.. 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఓ ప్రత్యేక పోస్టర్ సోషల్ మీడియాలో పంచుకుంది. భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకుల అందరికి ధన్యవాదాలు తెలియజేసింది.
A moment of glory ❤️??
Proudly celebrating 50 DAYS of #Kalki2898AD. A big thank you to our incredible audience for making our film flourish across the world.#50DaysForKalki2898AD ❤️?@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh… pic.twitter.com/HE1hQlOfBe
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 15, 2024
ఈ సినిమా 50 రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందులో దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో పలువురు ఆయన్ను శాలువాతో సన్మానించారు. అనంతరం నాగ్ అశ్విన్ పెద్ద కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంలో అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
AAY : ‘ఆయ్’ మూవీ రివ్యూ.. ముగ్గురు ఫ్రెండ్స్ ఫుల్ గా నవ్వించేశారుగా..
అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, కమల్‌హాసన్, మృణాల్ ఠాకూర్, మాళవిక మోహన్ కీలక పాత్రల్లో నటించారు. రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిసిన ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వినీదత్ నిర్మించారు. ఇక మూవీకి రెండో భాగం కూడా ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే తెలియజేశారు. త్వరలోనే రెండో పార్టుకు సంబంధించిన షూటింగ్‌ను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. కల్కి మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Thangalaan : ‘తంగలాన్’ మూవీ రివ్యూ.. బంగారం కోసం యుద్ధం..
View this post on Instagram