Vijay Devarakonda : ఒక్క హిట్టు కోసం ఐదేళ్లు.. క‌న్నీళ్లొస్తున్నాయి.. విజ‌య్‌దేవ‌ర‌కొండ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టించిన సినిమా ఖుషి (Kushi). శివ నిర్వాణ (Shiva Nirvana) ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ ఈ సినిమాలో స‌మంత (Samantha) హీరోయిన్‌.

Vijay Devarakonda

Vijay Devarakonda Emotional : రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టించిన సినిమా ఖుషి (Kushi). శివ నిర్వాణ (Shiva Nirvana) ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ ఈ సినిమాలో స‌మంత (Samantha) హీరోయిన్‌. అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) బ్యానర్ పై తెర‌కెక్కింది. స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో నేడు(శుక్ర‌వారం సెప్టెంబ‌ర్ 1)న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. దాదాపుగా ప్ర‌తీ చోట పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Pawan Kalyan : పవన్ బర్త్ డేకి రెడీ అవుతున్న గిఫ్ట్స్.. ఏ సినిమా నుంచి ఏ అప్డేట్..?

ఈ చిత్రానికి వ‌స్తున్న స్పంద‌న చూసి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎమోషన‌ల్ అయ్యారు. ‘నాతో పాటు మీరంద‌రూ ఐదు సంవ‌త్స‌రాలుగా ఎదురుచూశారు. మీరెంత‌ ఓపిక‌గా ఎదురుచూశారో నాకు తెలుసు. మొత్తానికి ఈ రోజు మ‌నం అనుకున్న‌ది సాధించాం. వంద‌ల కొద్ది ఫోన్లు, మెసెజ్‌ల‌తో ఈ రోజు ఉద‌యం నిద్ర‌లేచా. క‌న్నీళ్లు ఆగ‌డం లేదు. ల‌వ్ యూ ఆల్‌. మీరంతా మీ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో క‌లిసి మూవీని ఎంజాయ్ చేయండి. మీరు సినిమాకు వెళ్తార‌ని నాకు తెలుసు. ప్రేమ‌తో మీ విజ‌య్ దేవ‌ర‌కొండ.’ అంటూ ట్విట్ట‌ర్ లో విజ‌య్ రాసుకొచ్చాడు.

Jailer : జైలర్ సక్సెస్‌తో ఖుషీ అయిన నిర్మాత.. రజినీకి చెక్‌తో పాటు BMW కారుని..

గ‌తేడాది భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన‌ ‘లైగ‌ర్’ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా విజ‌య్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచింది. దీంతో విజ‌య్ కొంత గ్యాప్ తీసుకుని ఖుషి చిత్రంలో న‌టించాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. విజ‌య్ పై విధంగా స్పందించాడు.