×
Ad

VD13 Movie : సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ.. VD13 ఫిక్స్.. టైటిల్ అనౌన్స్ త్వరలో..

VD13 సినిమా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సడెన్ గా VD13 సినిమా రిలీజ్ అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

  • Published On : September 27, 2023 / 10:16 AM IST

Vijay Devarakonda Mrunal Thakur VD13 Movie Release Date announced Title Revealing Soon

VD13 Movie :  విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) లైగర్(Liger) ఫ్లాప్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే సమంతతో(Samantha) కలిసి ఖుషి(Kushi) అంటూ వచ్చి పర్వాలేదనిపించాడు. ఖుషి తర్వాత విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 12వ సినిమా, గీతగోవిందం లాంటి హిట్ సినిమా ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 13వ సినిమాలున్నాయి.

VD13 సినిమా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నా VD12 ఉండటంతో ఈ సినిమా ఇప్పట్లో ఉండదని అనుకున్నారు. అసలు VD13 గురించి ఎక్కడా టాపిక్ కూడా రావట్లేదు. కాని సడెన్ గా VD13 సినిమా రిలీజ్ అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

తాజాగా దిల్ రాజు సంస్థ విజయ్ దేవరకొండ VD13 సినిమా 2024 సంక్రాంతికి రాబోతున్నట్టు, ఇప్పటికే సగం షూట్ కూడా పూర్తయిందని ప్రకటించి ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలోనే అనౌన్స్ చేస్తామంటూ తెలిపారు. దీంతో రౌడీ హీరో అభిమానులు సంతోషిస్తున్నారు. అయితే VD12 గురించి ఎలాంటి ప్రకటన లేకుండానే ఇంకో మూడు నెలల్లో VD13 సినిమా అనౌన్స్ చేయడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. ఈ మూడు నెలల్లోపు VD12 కూడా వచ్చేస్తుందా అని సందేహం వ్యక్తపరుస్తున్నారు.

Also Read : Neha Shetty : డీజే టిల్లు రాధిక ప్రేమలో ఉందా? ప్రేమ గురించి గొప్పగా చెప్పిన నేహశెట్టి.. నేహాని ఇంప్రెస్ చేయాలంటే..?

ఇక ఇది దిల్ రాజు సంస్థలో 54వ సినిమా. దిల్ రాజు VD13 సినిమాని సంక్రాంతికి ప్రకటించడంతో గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాతికి లేనట్టే అని మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు.