Vijay Devarakonda Speech in Keeda Cola Movie Pre Release event
Vijay Devarakonda : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యూత్ ని అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్(Tharun Bhascker) తన మూడో సినిమా ‘కీడా కోలా’(Keeda Cola)తో రాబోతున్నాడు. క్రైం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
తాజాగా కీడా కోలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగా ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు. ఇక ఈ కీడాకోలా సినిమాలో బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.
Also Read : Brahmanandam : అతని సినిమాలో ఛాన్స్ అడగాలంటే ఈగో అడ్డొచ్చింది.. తరుణ్ భాస్కర్ పై బ్రహ్మానందం కామెంట్స్..
ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నన్ను హీరోగా పరిచయం చేసింది తరుణ్ భాస్కర్. మన జీవితాన్ని.. మనం పెరిగిన వాతావరణం, మనం తీసుకునే నిర్ణయాలు, మనం కలిసే వ్యక్తులు.. ఈ మూడే నిర్ణయిస్తాయి. నా జీవితంలో వీటి వల్లే నేను ఇప్పుడు ఇలా మీ ముందు నిలబడ్డాను. నేను ఈ స్థాయిలో ఉండటానికి నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సందీప్ వంగా.. ఈ ముగ్గురే కారణం. కొన్నాళ్ల క్రితం వరకు వీళ్ళు ఎవరో నాకు తెలీదు, నేను ఎవరో వీళ్ళకి తెలీదు. ఒక్కొక్కరం ఒక్కోచోట చదివినా, పెరిగినా సినిమా మమ్మల్ని కలిపింది. నేను, తరుణ్ ఎవరో మీకు తెలియకపోయినా పెళ్లి చూపులు సినిమాని ఆదరించారు. దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అని అన్నారు. ఇలా విజయ్ తన సినీ ప్రయాణాన్ని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గుర్తు చేసుకున్నాడు. అలాగే కీడాకోలా సినిమా గురించి మాట్లాడి, చిత్రయూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపాడు విజయ్.