Vijay Deverakonda : మొన్నటిదాకా బన్నీ.. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. KFCకి కొత్త బ్రాండ్ అంబాసిడర్.. ఫోటోలు వైరల్..

నేడు KFC యాడ్ కోసం తీసిన పలు ఫోటోలను విజయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Vijay Deverakonda as New Brand Ambassador for KFC Photos goes Viral

Vijay Deverakonda : మన సెలబ్రిటీలు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క యాడ్స్ కూడా చేస్తారని తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే పలు యాడ్స్ చేసి మెప్పించగా తాజాగా మరో కొత్త యాడ్ చేసాడు. ఫేమస్ ఫుడ్ కంపెనీ KFC కు బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండని తీసుకున్నారు. మొన్నటిదాకా అల్లు అర్జున్ KFC కి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇప్పుడు బన్నీ ప్లేస్ లో విజయ్ ఎంట్రీ ఇచ్చాడు.

Also Read : KA Collections : కిరణ్ అబ్బవరం అదరగొట్టాడుగా.. మైండ్ బ్లోయింగ్ ‘క’ కలెక్షన్స్.. పది రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?

నేడు KFC యాడ్ కోసం తీసిన పలు ఫోటోలను విజయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. విజయ్ ఇందులో ఆకాశంలో హాట్ ఎయిర్ బెలూన్ లో KFC ఫుడ్ తింటున్నట్టు పోజులు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. విజయ్ తో KFC ఓ వీడియో యాడ్ కూడా చేసినట్టు సమాచారం. త్వరలోనే అది కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి.