Vijay – Mrunal : ఎంతైనా విజయ్ రూటే సపరేటు.. ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్లో బైక్పై మృణాల్తో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ..
తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ చేసిన పని వైరల్ గా మారింది.
- Saketh U
- Updated on- April 3, 2024 / 06:50 AM IST
Vijay Deverakonda entry in Family Star Pre Release Event on Bike with Mrunal Thakur
Vijay Deverakonda – Mrunal Thakur : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా దిల్ రాజు నిర్మాణంలో పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
సాధారణంగానే విజయ్ అందరు హీరోలకు డిఫరెంట్ గా ఉంటాడు. కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడు అన్ని విషయాల్లోనూ. స్పీచ్ లు, అతని సినిమాలు అన్ని డిఫరెంట్ గా ఉండటంతోనే తక్కువ టైంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ చేసిన పని వైరల్ గా మారింది.
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఎవరికి వాళ్ళు స్టార్స్ కార్ లో వచ్చి పార్కింగ్ నుంచి స్టేజి వరకు నడిచి వస్తారు. కానీ తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ బైక్ పై మృణాల్ ఠాకూర్ ని ఎక్కించుకొని బయటి నుంచి స్టేజి వరకు తీసుకొచ్చాడు. చుట్టూ కెమెరాలు, బౌన్సర్లు మధ్య విజయ్ మృణాల్ ని బైక్ పై తీసుకొచ్చాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా ఎంతైనా విజయ్ రూటే సపరేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.
