Vijay Deverakonda : ‘లైగర్’ ఎఫెక్ట్ ఇంకా మర్చిపోని విజయ్ దేవరకొండ.. ఎప్పటికైనా 200 కోట్లు కొడతా.. నన్ను తిట్టుకున్నా పర్లేదు..

లైగర్ సినిమా రిలీజ్ కి ముందు ఈ సినిమా మినిమమ్ 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని విజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ వ్యాఖ్యలని పట్టుకొని చాలామంది విజయ్ ని ట్రోల్ చేశారు, తిట్టారు.

Vijay Deverakonda : ‘లైగర్’ ఎఫెక్ట్ ఇంకా మర్చిపోని విజయ్ దేవరకొండ.. ఎప్పటికైనా 200 కోట్లు కొడతా.. నన్ను తిట్టుకున్నా పర్లేదు..

Vijay Deverakonda comments on Liger Movie Trolls in Family Star Movie Pre Release event

Updated On : April 3, 2024 / 6:20 AM IST

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్'(Family Star) సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. గీతగోవిందం కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే విజయ్ గీతగోవిందం సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు మళ్ళీ. ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. లైగర్ సినిమా భారీ పరాజయం చూసింది. ఖుషి సినిమా యావరేజ్ గా నిలిచింది.

అయితే లైగర్ సినిమా రిలీజ్ కి ముందు ఈ సినిమా మినిమమ్ 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని విజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ వ్యాఖ్యలని పట్టుకొని చాలామంది విజయ్ ని ట్రోల్ చేశారు, తిట్టారు. తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ దానిపై స్పందించాడు.

Also Read : Suriya – Jyothika : జిమ్‌లో సూర్యతో కలిసి జ్యోతిక వర్క్ అవుట్స్.. పర్ఫెక్ట్ కపుల్ గోల్స్..

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మీకు మంచి సినిమా ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. కానీ ఇప్పటికి గీత గోవిందం సినిమా తర్వాత ఆ రేంజ్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయలేకపోయాను. ఆ సినిమాకి 100 కోట్లు కొట్టాను. ఆ తర్వాత ఓ సినిమాకి 200 కోట్లు కొడతానని చెప్పను. కానీ కొట్టలేకపోయాను. ఇప్పటికి కూడా చాలా మంది అలాంటి మాటలు ఎందుకు మాట్లాడావు, అది తప్పు అని ప్రేమగా, కోపంగా చెప్తూనే వచ్చారు. నువ్వు అలా మాట్లాడితే పొగరులా అనిపిస్తుంది అన్నారు. కానీ ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నా 200 కోట్లు కొడతా అని చెప్పడం తప్పు కాదు, చెప్పి కొట్టకపోవడం తప్పు. దాని వాళ్ళ నేను ఎన్నో తిట్లు తిన్న, అవమానాలు చూసాను. కానీ నేను ఏదో ఒక రోజు నేను 200 కోట్లు కొడతా. అప్పటివరకు తిడుతూనే ఉండండి. ఇప్పుడు కూడా మీరు దీన్ని పొగరు, బలుపు అనుకుంటారు. కానీ ఇది నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ అని అన్నాడు. దీంతో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి.