Vijay Deverakonda : విజయ్ దేవరకొండ భారీ కట్ అవుట్.. రౌడీ బాయ్ ఎమోషనల్ పోస్ట్..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ భారీ కట్ అవుట్. ఫ్యామిలీ స్టార్ గురించి విజయ్ ఎమోషనల్ పోస్ట్..

Vijay Deverakonda Huge Cutout in family star release celebrations

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. పరుశురాం ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. గీతగోవిందం తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగు, తమిళంలో రిలీజ్ అయ్యింది.

దీంతో నేడు థియేటర్స్ వద్ద రౌడీ బాయ్స్ సందడి కనిపిస్తుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల మార్నింగ్ షోలు పడడంతో ఫ్యాన్స్ తెల్లవారుజాము నుంచి థియేటర్స్ వద్ద గోల చేస్తున్నారు. కాగా సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్స్ వద్ద భారీ కట్ అవుట్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా తరుచుగా జరుగుతుంది. ఇక ఈ మూవీ విడుదల సందర్భంగా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ వద్ద విజయ్ 80 అడుగుల భారీ కట్ అవుట్ ని ఏర్పాటు చేసారు.

Also read : Family Star : విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఏంటి..?

టాలీవుడ్ బడా హీరోల మాదిరి విజయ్ కి కూడా ఈ రేంజ్ కట్ అవుట్ పెట్టడం విజయ్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది. దీంతో ఈ కట్ అవుట్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక ఇది ఉంటే, విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ వేశారు. నా ఫ్యామిలీ స్టార్ నువ్వే అంటూ తన తండ్రిపై ప్రేమని తెలుపుకొచ్చారు. తన తండ్రి గర్వపడేలా ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాని ఫ్యామిలీ కోసం పోరాడే ప్రతి ఒక్కరికి అంకితం ఇచ్చారు.

ఇక థియేటర్స్ లోకి వచ్చేసిన ఫ్యామిలీ స్టార్ రివ్యూలకు వస్తే.. మూవీ చూసిన వారు సోషల్ మీడియా ద్వారా తమ టాక్ ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. మరి ఫైనల్ గా ఈ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.