Family Star : విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఏంటి..?

‘గీతగోవిందం’ బజ్ తో నేడు థియేటర్స్ లోకి వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' సక్సెస్ ని అందుకుందా..? ట్విట్టర్ టాక్ ఏంటి..?

Family Star : విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఏంటి..?

Vijay Deverakonda Mrunal Thakur Family Star twitter review

Family Star : ‘గీతగోవిందం’ తరువాత దర్శకుడు పరుశురామ్ తో మరోసారి కలిసి విజయ్ దేవరకొండ చేసిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అండ్ ట్రైలర్.. ఇలా ప్రతిదీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి నేడు థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం సక్సెస్ ని అందుకుందా..? ట్విట్టర్ టాక్ ఏంటి..?

Also read : Prabhas : ‘ఫ్యామిలీ స్టార్’కి రెబల్ స్టార్ విషెస్.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా స్టోరీ..

ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ వరుకే బాగున్నాయని, కామెడీ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదని, ఇంటర్వెల్ కూడా ఓకే అన్నట్లుగా ఉందని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ కూడా పెద్దగా ఏమి లేదని, కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తప్ప. మొత్తం మీద యావరేజ్ బొమ్మ అని చెబుతున్నారు.

మూవీ స్లోగా స్టార్ట్ అయ్యి ప్రీ ఇంటర్వెల్ టైంకి హైకి వెళ్లిందని చెబుతున్నారు. ఫైట్స్ బాగున్నాయట. విజయ్ అండ్ మృణాల్ ప్రెజెన్స్ ఆకట్టుకుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించిందట.

ఫస్ట్ హాఫ్ బాగుందట. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బోరింగ్ ఉందని చెబుతున్నారు. బీజీఎమ్ అసలు ఏం బాగోలేదట. సాంగ్స్ ఓకే అనిపించినా డాన్స్ నాట్ ఓకే అంటున్నారు. విజయ్ అండ్ మృణాల్ కెమిస్ట్రీ ఓకే అంటున్నారు.

ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ పై కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బెటర్ అని చెబుతున్నారు. వెన్నెల కిశోర్ ని సరిగ్గా ఉపయోగించుకోలేదట. మృణాల్ ఆకట్టుకుందట. విజయ్ నుంచి ఇంకొంచెం ఆశించవచ్చు అని చెబుతున్నారు. మొత్తం మీద సినిమా యావరేజ్ అంటున్నారు.

సినిమా ఒక రామ్ కామ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంట. ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ ముందు వరకు చాలా స్లోగా సీరియల్ గా ఉందని అనిపిస్తుందట. సెకండ్ హాఫ్ ఫన్ తో స్టార్ట్ అయ్యినప్పటికీ వెంటనే మల్లి ఎమోషన్ వైపు టర్న్ తీసుకుంటుందట. కొన్ని ఎంజాయ్ చేసే మూమెంట్స్ తప్ప ఎమోషనల్ కనెక్ట్ లేదా ఫీల్ గుడ్ మూమెంట్స్ ఏమి లేవని చెబుతున్నారు. మ్యూజిక్ అసలు ఏమి లేదని చెబుతున్నారు. గీతగోవిందం మార్క్ సినిమా అయితే కాదని అంటున్నారు.