Vijay Deverakonda : మెగాస్టార్, సూపర్‌స్టార్.. ఇప్పుడు రౌడీ స్టార్..
టాలీవుడ్ రౌడీ స్టార్, ‘లైగర్’ తో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ పాపులర్ సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్ యాడ్‌లో నటిస్తున్నాడు..
- sekhar
- Updated on- January 31, 2022 / 05:12 PM IST
Thums Up
Vijay Deverakonda: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు కమర్షియల్స్‌లోనూ నటిస్తుంటారనే సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సక్సెస్ఫుల్ బ్రాండ్లకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. మహేష్ చేసిన యాడ్స్‌లో థమ్స్ అప్ ప్రకటన ప్రత్యేకమని చెప్పాలి.
SSMB 28 : మహేష్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..
రణ్ వీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్‌తోనూ ఆయన ఈ యాడ్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు థమ్స్ అప్ యాడ్‌లోకి కొత్త హీరో వచ్చాడు. ఇంతకుముందు కొన్ని యాడ్స్ చేసిన టాలీవుడ్ రౌడీ స్టార్, ‘లైగర్’ తో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ పాపులర్ సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్ యాడ్‌లో నటిస్తున్నాడు.
ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో విజయ్ న్యూ అవతార్‌లో కనిపిస్తున్నాడు. అలాగే ఇప్పటివరకు ఉన్న ‘టేస్ట్ ది థండర్’ అనే ట్యాగ్ లైన్ కూడా మార్చారు. విజయ్ నటిస్తున్న థమ్స్ అప్ యాడ్‌కి ‘సాఫ్ట్ డ్రింక్ కాదు ఇది తుఫాన్’ అనే సరికొత్త ట్యాగ్ ఇచ్చారు. త్వరలో విజయ్ థమ్స్ అప్ యాడ్ ఆడియన్స్ ముందుకి రానుంది. #ThumsUp #RowdyForThunder #ThumsUpStrong #Toofan ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
మొదలైంది మెగాస్టార్‌తోనే..
థమ్స్ అప్ యాడ్ ముందుగా మెగాస్టార్ చిరంజీవితో స్టార్ట్ అయింది. అప్పట్లో చిరు చేసిన యాడ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. యంగ్ హీరో శర్వానంద్ కూడా నటించాడు. మెగాస్టార్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు థమ్స్ అప్ తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా బాగా పాపులర్ అయ్యాడు.
థమ్స్ అప్ యాడ్స్ రెగ్యులర్ యాడ్స్‌లా ఉండవు. ఓ హాలీవుడ్ సినిమాకి యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసినట్లు కాన్సెప్ట్స్ డిజైన్ చేస్తుంటారు. బైక్స్, హెలికాప్టర్స్ వేసుకుని, థమ్స్ అప్ కోసం గాల్లో ఎగరడం, సముద్రంలో, అడవుల్లో సాహసాలు చెయ్యడం.. సాలిడ్‌గా ఉంటాయసలు థమ్స్ అప్ యాడ్స్.. మెగాస్టార్, సూపర్ స్టార్ తర్వాత థమ్స్ అప్ కోసం రౌడీ స్టార్ ఎలాంటి అడ్వంచర్స్ చేస్తాడో చూడాలి.
