Vijay Devarakonda Khushi movie rights sold at a huge price
Vijay Deverakonda: టాలీవుడ్ లో హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా తన క్రేజ్ ని అంచలంచలుగా పెంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. మాస్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ తో కలిసి విజయ్ చేసిన ‘లైగర్’ మూవీ భారీ అంచనాలు మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. గీతా గోవిందం సినిమా తరువాత సరైన హిట్ లేని విజయ్ కమ్ బ్యాక్ కోసం రౌడీ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
Vijay Deverakonda: బ్రహ్మాస్త్ర-2లో విజయ దేవరకొండ.. స్పందించిన డైరెక్టర్!
ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. టాలీవుడ్ యాక్ట్రెస్ సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే సగం పైగా షూటింగ్ జరుపుకోగా, సమంత అనారోగ్యానికి గురి కావడంతో మూవీకి బ్రేక్ పడింది. కాగా ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళం నాన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.92 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు సమాచారం.
లైగర్ వంటి డిజాస్టర్ తరువాత కూడా విజయ్ సినిమాకు ఇంత రేట్ పలకడంతో సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్లి బ్యాలన్స్ షూట్ కూడా కంప్లీట్ చేయనున్నారు. మలయాళ మూవీ హృదయం ఫేమ్ ‘హేశం అబ్దుల్ వహాబ్’ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి కలిసొచ్చిన ప్రేమకథలైన విజయ్ కి సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.