Kushi : ఒక్క సాంగ్‌తోనే రికార్డు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ.. వరల్డ్ టాప్ 5!
లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వస్తాను అంటున్న విజయ్ దేవరకొండ. ఖుషి ఫస్ట్ తోనే వరల్డ్ రికార్డుని క్రియేట్ చేశాడు.
- gum 95921
- Published On : May 11, 2023 / 10:46 AM IST
Vijay Deverakonda Kushi first song creates world record
Kushi : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సమంత (Samantha) హీరోయిన్ గా నటించింది. ఇక ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా మూవీలోని ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సాంగ్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సాంగ్ మ్యూజిక్, లిరిక్స్ తో పాటు విజువల్స్, సమంత అండ్ విజయ్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ ని ఇచ్చింది.
VD12 : విజయ్ దేవరకొండ సినిమా పై నెటిజెన్ కామెంట్.. నిర్మాత కౌంటర్ ట్వీట్!
దీంతో ఈ సాంగ్ యూట్యూబ్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ‘నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే’ అంటూ సాగే ఈ పాటకి దర్శకుడు శివ నిర్వాణనే లిరిక్స్ ని అందించాడు. ఈ సాంగ్ లిరిక్స్ ని డైరెక్టర్ మణిరత్నం సినిమాల పేర్లతో సమకూర్చడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ పాటని పాడాడు. తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట అన్ని భాషల నుంచీ అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది. ఇక యూట్యూబ్ లో దాదాపు 15 మిలియన్ వ్యూస్ తో పాటు లక్ష లైక్స్ తో వాల్డ్ బెస్ట్ ఆడియో చార్ట్ బస్టర్స్ లో ఐదవ స్థానాన్నిసొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.
Samantha : కొనసాగుతున్న మయోసైటిస్ ట్రీట్మెంట్.. నరకంగా ఉందంటున్న సమంత!
ఇక రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కే ఇంతటి రెస్పాన్స్ రావడంతో మూవీ టీం ఫుల్ ఖుషిలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. లైగర్ సినిమాతో మిస్ అయిన పాన్ ఇండియా హిట్టుని విజయ్ ఈ సినిమాతో అందుకుంటాడా? లేదా? చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
Sensational response for the lovely melody ❤️#NaRojaNuvve & #TuMeriRoja among the most viewed Songs on YouTube worldwide in the past 24 hours ❤️?
– https://t.co/ppoHHuX9Qo#Kushi @TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @saregamasouth pic.twitter.com/8fXSdigW37
— Mythri Movie Makers (@MythriOfficial) May 10, 2023
