Vijay Deverakonda: రామ్ చరణ్ కథతో విజయ్ దేవరకొండ సినిమా?

ప్రపంచ బాక్సాఫీస్ వద్ద "RRR" అద్భుతమైన విజయం సాధించడంతో.. ఆ సినిమాకి పని చేసిన దర్శకుడు మరియు హీరోల తదుపరి ప్రాజెక్ట్‌లపై ప్రభావం చూపుతుంది. "ఆర్ఆర్ఆర్"తో వచ్చిన ఫేమ్ ని నిలబెట్టుకొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ మూగ్గురు. ఈ నేపథ్యంలోనే...

Vijay Deverakonda Movie With Ram Charan's Story

Vijay Deverakonda: ప్రపంచ బాక్సాఫీస్ వద్ద “RRR” అద్భుతమైన విజయం సాధించడంతో.. ఆ సినిమాకి పని చేసిన దర్శకుడు మరియు హీరోల తదుపరి ప్రాజెక్ట్‌లపై ప్రభావం చూపుతుంది. “ఆర్ఆర్ఆర్”తో వచ్చిన ఫేమ్ ని నిలబెట్టుకొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ మూగ్గురు. ఈ నేపథ్యంలోనే చరణ్, శంకర్ దర్శకత్వంలో కలిసి భారీ స్థాయిలో ఒక సినిమా చేస్తున్నాడు.

Ram Charan: చిన్ననాటి గురువుని గుర్తుపెట్టుకొని మరి ఇంటికి వెళ్లి కలిసిన రాంచరణ్..

ఈ ప్రాజెక్ట్ తరువాత రాంచరణ్.. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నానూరితో చిత్రం చేయాల్సి ఉంది. అయితే అది కాస్త క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది. జెర్సీ హిందీ వెర్షన్ పరాజయం పాలైన తర్వాత, గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్‌ని డైరెక్ట్ చేసే అవకాశాలు చేజార్చుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అదే ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీని విజయ్ దేవరకొండకు గౌతమ్ వినిపించాడట.

విజయ్ కూడా ఇందుకు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. “లైగర్” వంటి మాస్ చిత్రాలు చేసి చేతులు కాల్చుకోవడం కంటే.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి కలిసొచ్చిన ప్రేమకథలతోనే ముందుకు వెళ్ళడానికి సిద్దమయ్యాడు. ప్రస్తుతం శివ నిర్వాణతో ఖుషి అనే లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే.