Vijay Deverakonda Mrunal Thakur VD13 Movie teaser and title update
VD13 Movie : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న సినిమా VD13. విజయ్ కి గీతగోవిందం లాంటి హిట్ సినిమా ఇచ్చిన పరుశురామ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే లాంచ్ అయ్యి షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని.. వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకు వస్తామంటూ మేకర్స్ ఇప్పటికే ప్రకరటించారు. అయితే కచ్చితమైన డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారని సమాచారం.
ఈ టీజర్ ని అక్టోబర్ 18న రిలీజ్ చేయడానికి దర్శకుడు రెడీ చేస్తున్నాడట. ఈ టీజర్ తోనే మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారట. అలాగే టైటిల్ ని కూడా ప్రకటించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకి రెండు టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఒకటి ‘ఫ్యామిలీ స్టార్’, రెండోది ‘కుటుంబరావు’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఆడియన్స్ ఈ రెండు టైటిల్స్ ని కలిపి ‘ఫ్యామిలీ స్టార్ కుటుంబరావు’ అని పెడితే కూడా బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. మరి చిత్ర యూనిట్ ఏ టైటిల్ ని ఫైనల్ చేస్తారో చూడాలి.
Also read : The Vaccine War : ఆస్కార్‌కి ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా.. శాశ్వత స్థానం దక్కించుకుంది..
కాగా సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వెంకటేష్ ‘సైంధవ్’, మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, తేజా సజ్జా ‘హనుమాన్’, రవితేజ ‘ఈగల్’ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇక నాగార్జున ‘నా సామిరంగ’, రజినీకాంత్ ‘లాల్ సలామ్’ సినిమాలు డేట్ అనౌన్స్ చేయకున్నా సంక్రాంతికే వస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ ఉండేలా కనిపిస్తుంది. మరి ఈ చిత్రాలు అన్ని చెప్పినట్లు పండక్కే వస్తాయా? లేదా వెనక్కి తగ్గుతాయా? అనేది చూడాలి.