Ranabaali: యాడుండావ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా.. ‘రణబాలి’ సినిమా నుంచి విజయ్ వీడియో లీక్

విజయ్ దేవరకొండ రణబాలి(Ranabaali) సినిమా నుంచి ఒక వీడియో లీక్ అయ్యింది.

vijay deverakonda ranabaali shooting in rayalaseema

  • గుర్రంపై విజయ్ దేవరకొండ రౌద్రం
  • ‘రణబాలి’ షూటింగ్ వీడియో లీక్
  • రాయలసీమ యాసలో విజయ్ మాస్ డైలాగ్

Ranabaali: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబోలో వస్తున్న భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి(Ranabaali)’. శ్యామ్ సింఘా రాయ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో నెలకొన్నాయి. 1854 – 1878 మధ్య కాలంలోని బ్రిటిష్ పాలనలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Mrithyunjay OTT: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ నేపథ్యంలోనే సెట్స్ నుంచి లీక్ అయిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ చేస్తోంది. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, రాయలసీమ యాసలో విజయ్ చెప్పిన “ముండమోపి నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా.. రాప్పా సంపుదువ్ కానీ..” అనే మాస్ డైలాగ్ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో హింట్ ఇస్తోంది.

బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టేలా ఈ చిత్రాన్ని రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత విజయ్ – రష్మిక జంటగా వస్తుండటంతో పాటు, విజయ్ పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌పై క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఇది కచ్చితంగా విజయ్ కెరీర్‌లోనే ఒక మైలురాయి మిగిలిపోతుంది అంటూ ఆ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా 2026 చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.