Ranabaali : బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం.. ర‌ణ‌బాలి వ‌సూళ్లు ఎంతంటే?

Ranabaali : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’.

Vijay Deverakonda Rashmika Mandanna Ranabaali Movie collections

Ranabaali : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే మంచి స్పంద‌న‌ను ద‌క్కించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘రణబాలి’ ఇప్పటివరకు తన ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సుమారు 70 శాతం వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం బ్రేక్‌ఈవెన్‌కు చేరువైంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బ్రేక్‌ఈవెన్ సాధించి లాభాల దిశగా సాగుతున్నట్లు సమాచారం. మ‌రో నాలుగైదు రోజుల్లోనే ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్‌ఈవెన్ సాధించనున్న‌ట్లు చెబుతున్నారు.

Jabardasth Vinod : జబర్దస్త్ వినోద్ ఫ్యామిలీ ఫోటోలు.. వైర‌ల్

ఇక ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన‌ట్లు స‌మాచారం. చిత్ర బృందం అధికారికంగా వ‌సూళ్ల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. మొత్తానికి.. విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న జంట‌గా న‌టించిన ర‌ణ‌బాలి స‌క్సెస్ ఫుల్‌గా థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతోంది.