Ranabaali : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
తాజాగా ఈ సినిమాని వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. (Ranabaali)
- Saketh U
- Published on- August 27, 2026 / 11:19 AM IST
Ranabaali
Ranabaali : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న సినిమా రణబాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు, మమ్మి ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
అయితే తాజాగా ఈ సినిమాని వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. రణబాలి సినిమా దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ కానున్నట్టు నేడు ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది ఈ సినిమా. 1878 కాలంలో రాయలసీమలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిన రణబాలి అనే యోధుడు కథగా ఈ సినిమా ఉండబోతుందని గ్లింప్స్ లో చూపించారు. సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ షర్ట్ లేకుండా ఓ భారీ కత్తిని భుజంపై పెట్టుకొని ఉన్నాడు.
Also Read : Toxic : ఇదేం చోద్యం.. అలా ప్రచారం చేయోద్దట.. కోర్టు నుంచి నోటీసులు తెచ్చుకున్న టాక్సిక్ నిర్మాతలు..
