Vijay Deverakonda Rowdy Janardhana Title Glimpse out now
Rowdy Janardhana : విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి రౌడీ జనార్ధన (Rowdy Janardhana) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఇక రెండు నిమిషాల ఏడు సెకన్ల నిడివి ఉన్న గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కండలు తిరిగిన దేహం, ఒండినిండా రక్తపు మరకలు, చేతితో కత్తితో ఉన్న విజయ్ లుక్ అదిరిపోయింది.
Nari Nari Naduma Murari : శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ వచ్చేసింది..
దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి, హీరో రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 80వ దశకంలో తూర్పుగోదావరి నేపథ్యంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందట. ఇక 2026 డిసెంబర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.