Kushi : ఇండియాలో విజయ్ దేవరకొండ.. అమెరికాలో సమంత.. ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారుగా..
ఖుషి మూవీ ప్రమోషన్స్ విజయ్ అండ్ సమంత ఓ రేంజ్ లో నిర్వహిస్తున్నారుగా. ఇక్కడ ఇండియాలో విజయ్ దేవరకొండ.. అక్కడ అమెరికాలో సమంత..
- gum 95921
- Published On : August 21, 2023 / 05:09 PM IST
Vijay Deverakonda Samantha Kushi Movie promotions from India to America
Kushi : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కలిసి నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో ఉన్న చిత్ర యూనిట్.. ప్రెస్ మీట్‌లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ ని విజయ్ దేవరకొండ ఇండియాలో ఉండి నిర్వహిస్తుంటే, సమంత అమెరికా నుంచి చేస్తుంది.
న్యూయార్క్ నగరంలో జరిగే 41వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సమంత అమెరికా వెళ్ళింది. ఇక ఆ కార్యక్రమంలో పాల్గొన్న సమంత.. ఖుషి మూవీ ప్రమోషన్స్ ని అక్కడి నుంచే నిర్వహించేస్తుంది. ఆ ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ.. “ఈ కార్యక్రమంతో మన కల్చర్ ఎంతటి గొప్పదో నాకు తెలియజేశారు. నన్ను కూడా ఇందులో భాగం చేసినందుకు కృతజ్ఞతలు. అలాగే నా ప్రతి సినిమా ఆదరిస్తూ నన్ను ఇంతలా అభిమానిస్తున్నందుకు చాలా పెద్ద థాంక్యూ. రేపు రిలీజ్ అయ్యబోయే ఖుషిని కూడా తప్పక చూడండి. మీకు బాగా నచ్చుతుంది” అంటూ పేర్కొంది.
Raviteja : యూరప్ బయలుదేరిన మాస్ మహారాజ్ రవితేజ.. ఎందుకో తెలుసా..?
ఇక సమంత హాలీవుడ్ లో ఖుషి మూవీ ప్రమోషన్స్ చేస్తుంటే, విజయ్ దేవరకొండ.. మన పక్క ఇండస్ట్రీ అయిన కోలీవుడ్ లో సందడి చేస్తున్నాడు. ఈరోజు ఆగష్టు 21 ఉదయం తమిళనాడు కోయంబత్తూరులోని ఒక కాలేజీలో స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయిన విజయ్.. ఈవెనింగ్ చెన్నైలో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొనున్నాడు. ఇలా హీరోహీరోయిన్లు ఇద్దరు కలిసి మూవీని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. కాగా విజయ్ అండ్ సామ్ ఇద్దరి గత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలిచాయి. దీంతో ఖుషితో ఎలాగైనా సక్సెస్ అందుకొని హిట్ ట్రాక్ లోకి ఎక్కాలని చూస్తున్నారు.
Our “MEGA SUPERSTAR” @Samanthaprabhu2’s Speech at 41st Annual #IndiaDayParade in NYC ??#KushiOnSep1st #Kushi #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/skTidDdd5y
— Samantha FC || TWTS™ (@Teamtwts2) August 20, 2023
