Samantha : చుట్టూ 10 మందికి పైగా బాడీగార్డ్‌లతో.. హాలీవుడ్ గడ్డపై సమంత స్టార్‌డమ్ చూశారా.. పిక్స్ వైరల్..

న్యూయార్క్ న‌గ‌రంలో జరిగే 41వ భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన సమంత అక్కడ చుట్టూ 10 మందికి పైగా బాడీగార్డ్‌లతో..

Samantha : చుట్టూ 10 మందికి పైగా బాడీగార్డ్‌లతో.. హాలీవుడ్ గడ్డపై సమంత స్టార్‌డమ్ చూశారా.. పిక్స్ వైరల్..

Samantha at 41 Bharat Independence day celebrations in New York pics viral

Updated On : August 21, 2023 / 4:18 PM IST

Samantha : మయోసైటిస్ నుంచి కోలుకునే క్రమంలో కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సమంత.. మొన్నటి వరకు హాలిడే వెకేషన్ ని బాగా ఎంజాయ్ చేసింది. ఆ తరువాత వెనక్కి వచ్చి ఖుషి (Kushi) మూవీ ప్రమోషన్స్ లో జాయిన్ అయిన సామ్.. తాజాగా న్యూయార్క్ న‌గ‌రంలో జరిగే 41వ భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్ళింది. ఇక ఆ కార్యక్రమంలో పాల్గొన్న సమంత.. చుట్టూ 10 మందికి పైగా బాడీగార్డ్‌లతో హాలీవుడ్ విధుల్లో నడుస్తూ వెళ్తుంటే ఓ రేంజ్ లో ఉంది.

Raviteja : యూరప్ బయలుదేరిన మాస్ మహారాజ్ రవితేజ.. ఎందుకో తెలుసా..?

అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అవి చూసిన టాలీవుడ్ ఆడియన్స్.. హాలీవుడ్ గడ్డపై సమంత స్టార్‌డమ్ మాములుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ కార్యక్రమానికి హాజరుకావడం పై సమంత తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ వేసింది. తన మొదటి సినిమా ‘ఏ మాయ చేశావే’లోని కొన్ని సన్నివేశాల షూటింగ్ న్యూయార్క్ లోనే జరిగింది. ఆ సమయంలో కొంత భయం అనిపించిందని, కానీ నేడు 14 ఏళ్ళ తరువాత ఒక అతిథిగా హాజరవుతానని తాను ఎప్పుడు అనుకోలేదని చెప్పుకొచ్చింది.

Dulquer Salman : మలయాళ నిర్మాతలతో ఇబ్బందులు పడ్డాను.. అందుకే నేనే నిర్మాతగా మారాను.. తెలుగు నిర్మాతలు..

ఇక ఆ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల వేదిక పై సమంతని మెగా సూపర్ స్టార్ అంటూ అందరికి పరిచయం చేయడంతో.. ఆమె అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక స్టేజిపై సమంత మాట్లాడుతూ.. “మన కల్చర్ ఎంతటి గొప్పదో ఈ కార్యక్రమంతో నాకు తెలియజేశారు. నన్ను ఇందులో భాగం చేసినందుకు, నన్ను అభిమానిస్తున్నందుకు థాంక్యూ” అంటూ పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)