Kushi : విజయ్, సమంతల ఖుషీ మూమెంట్స్‌తో టైటిల్ సాంగ్.. పాట రిలీజ్ అయ్యింది చూశారా..?
విజయ్, సమంతల ఖుషి మూవీ నుంచి ఇప్పటికే ‘నా రోజా నువ్వే’, 'ఆరాధ్య' సాంగ్స్ రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ అందుకున్నాయి. తాజాగా టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.
- gum 95921
- Published On : July 28, 2023 / 06:52 PM IST
Vijay Deverakonda Samantha Kushi movie title song release
Kushi : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కలిసి నటిస్తున్న లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘నా రోజా నువ్వే’, ‘ఆరాధ్య’ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. “ఖుషీ నువు కనబడితే, ఖుషీ నీ మాట వినబడితే”.. అంటూ సాగే ఈ పాటకి దర్శకుడు శివ నిర్వాణ లిరిక్స్ అందించాడు.
Esha Gupta : ఈషా గుప్తా కూడా సమంతలా బాధపడుతుందా..? ఆమె తీసుకున్న హైపర్బేరిక్ థెరపీనే ఈమె కూడా..!
ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గత రెండు పాటలకి కూడా శివ నిర్వాణనే సాహిత్యం అందించగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సాంగ్ లిరిక్స్ కూడా మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ పాటని సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ పాడాడు. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు.
Pawan fans tore screen : పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహం.. స్క్రీన్‌ను చింపడం ఏంటి బ్రో..?
సెప్టెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. విజయ్ అండ్ సమంత ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్లాప్ ల్లో ఉండడంతో.. ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందిస్తారు అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. నిన్ను కోరి, మజిలీ వంటి ప్రేమ కథలతో శివ నిర్వాణ సూపర్ హిట్టు అందుకోవడంతో ఈ మూవీ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి శివ నిర్వాణం హిట్ ఫార్ములా, అభిమానుల కోరిక.. ఈ మూవీని హిట్టు అయ్యేలా చేస్తుందా అనేది చూడాలి.
