×
Ad

Vijay Devarakonda: ఎంగేజ్మెంట్ రింగ్తో విజయ్ దేవరకొండ.. ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు.. చెప్పకనే చెప్పేశాడుగా

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అత్యంత రహస్యంగా కేవలం ఇరు కుటుంబాలకు చెందిన కొద్ది బందుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

Vijay Deverakonda spotted with engagement ring

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అత్యంత రహస్యంగా కేవలం ఇరు కుటుంబాలకు చెందిన కొద్ది బందుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే, ఈ ఎంగేజ్ మెంట్ గురించి అటు విజయ్ నుంచి కానీ.. ఇటు రష్మిక నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగని, ఈ వార్తలను ఎవరు ఖండించలేదు కూడా. దీంతో, వీరి(Vijay Devarakonda) ఎంగేజ్ మెంట్ జరగడం నిజమేనని తెలిసిపోయింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంటకు పెళ్లి చేయాలని ముహూర్తం ఫిక్స్ చేశారట కుటుంబసభ్యులు.

Pawan Kalyan: 30 నిమిషాలు నాన్ స్టాప్ కన్నడ స్పీచ్.. కన్నడిగుల మనసు గెలిచిన పవన్.. మరి ఇకనైనా..

అయితే, ఎంగేజ్మెంట్ వార్తల నేపధ్యంలో తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఆదివారం (అక్టోబర్ 5) పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నాడు. విజయ్ తోపాటు కుటుంభ సభ్యులు కూడా దర్శించుకున్నారు. ఆ సమయంలోనే విజయ్ చేతికి ఒక రింగ్ కనిపించింది. దాంతో ఆ రింగ్ ఖచ్చితంగా ఎంగేజ్ మెంట్ రింగ్ అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ కూడా చెప్పకనే ఆ శుభవార్తను అందరికీ తెలిసేలా చేశాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఆలాగే, ఆ ఫోటోను లైక్ చేస్తూ కొత్త జంటకు విశేష్ చెప్తున్నారు.