Vijay Deverakonda vs Anasuya : విజయ్ దేవరకొండ విషెస్ చెబుతూ.. హరీష్ శంకర్ అనసూయకు కౌంటర్ ఇచ్చాడా?
టాలీవుడ్ లో యాంకర్ అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతున్నా విషయం తెలిసిందే. తాజాగా ఈ గొడవలోకి హరీష్ శంకర్..
- gum 95921
- Published on- May 9, 2023 / 04:56 PM IST
Vijay Deverakonda vs Anasuya Harish Shankar counter tweet
Vijay Deverakonda vs Anasuya : గత కొంత కాలంగా టాలీవుడ్ నటి మరియు యాంకర్ అనసూయ భరద్వాజ్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతున్నా విషయం తెలిసిందే. ఈ వాగ్వాదం మరోసారి నెట్టింట రచ్చగా మారింది. ఇటీవల విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఖుషి నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పోస్టర్ లో విజయ్ పేరుకి ముందు ‘THE’ అనే ట్యాగ్ ఉంది.
Kushi : విజయ్ దేవరకొండ బర్త్ డే గిఫ్ట్.. ఖుషి ఫస్ట్ సాంగ్ రిలీజ్!
ఆ ట్యాగ్ గురించే అనసూయ ట్విట్టర్ లో వెటకారంగా ఒక పోస్ట్ వేసిందంటూ రౌడీ ఫ్యాన్స్ ఆమె పై ట్వీట్స్ వాగ్వాదానికి దిగారు. గత నాలుగు రోజులుగా ఈ విషయం గురించి నెట్టింట పెద్ద రచ్చే జరుగుతుంది. తాజాగా ఈ విషయం పై ఒక సెలబ్రెటీ రియాక్ట్ అయ్యాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ అనసూయకు కౌంటర్ ఇచ్చేలా ట్వీట్ చేశాడంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈరోజు (మే 9) విజయ్ పుట్టినరోజు కావడంతో సెలబ్రేటిస్ అంతా విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే హరీష్ కూడా విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.
Vijay Devarakonda: గ్లోబల్ స్టార్‌కు రౌడీ స్టార్ థ్యాంక్స్.. ఎందుకంటే..?
“సినిమా పై తనకి ఉన్న ప్యాషన్, తన టెంపర్ ని కంట్రోల్ చేసుకుంటూ ఎంతో స్టార్డమ్ ని సొంతం చేసుకున్న విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని ఇంగ్లీష్ లో ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ లో ప్రతి లైన్ లో ‘THE’ అనే పదాన్ని హైలైట్ చేసి ట్వీట్ చేశాడు. దీంతో హరీష్ శంకర్, అనసూయకు కౌంటర్ ఇస్తూనే ట్వీట్ చేశాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ట్వీట్ కి అనసూయ కూడా రెస్పాండ్ అయ్యినట్లు తెలుస్తుంది. అనసూయ తన అకౌంట్ నుంచి ఒక కొటేషన్‌ను షేర్ చేసింది. ‘వంద మంది కలిసి చేసినా తప్పు తప్పే అవుతుంది. ఒక్కడు రైట్ చేసినా అది రైట్ అవుతుంది’ అనే కొటేషన్‌ను ట్వీట్ చేస్తూ తనని అందరూ టార్గెట్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది.
