×
Ad

Vijay Deverakonda : ఆ జానర్‌లో మాత్రం నేను సినిమాలు చేయను.. విజయ్ దేవరకొండ నుంచి అలాంటి సినిమాలు రావా?

తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

  • Published On : April 4, 2024 / 08:08 AM IST

Vijay Deverakonda Want to act in all Genre Films except one Details Here

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకొని, భారీ సినిమాలే చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి, గీతగోవిందం.. రెండు సినిమాలతో విజయ్ బాగా పాపులర్ అయ్యాడు. గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ పడలేదు. ఆ తర్వాత వచ్చిన ట్యాక్సీవాలా పర్వాలేదనిపించింది. నోటా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలు భారీ ఫ్లాప్ చూస్తే ఖుషి యావరేజ్ గా నిలిచింది. దీంతో రేపు రిలీజవ్వబోయే ఫ్యామిలీ స్టార్ పైన అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందని అంతా నమ్మకంతో ఉన్నారు.

విజయ్ ఇప్పటికే రామ్ కామ్, యాక్షన్, లవ్ కామెడీ, సూపర్ న్యాచురల్, పొలిటికల్.. ఇలా అన్ని జానర్స్ టచ్ చేసాడు. తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Also Read : Vijay Deverakonda : ఓ పక్క ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్.. కానీ అమెరికాలో రష్మిక బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో బిజీగా విజయ్ దేవరకొండ..

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నేను ఎలాంటి జానర్ సినిమాలు అయినా, ఏ డైరెక్టర్ తో అయినా చేయడానికి రెడీ. కానీ హారర్ సినిమాలు(Horror Movies) మాత్రం చేయను. ఎక్కువమంది ఆడియన్స్ రీచ్ ఉండే సినిమాలే ఎక్కువగా చేయాలనుకుంటున్నాను. హారర్ సినిమాలకు అందరూ కనెక్ట్ అవ్వలేరు, నేను కూడా హారర్ సినిమాలు చూసి ఎంజాయ్ చేయలేను అని కామెంట్స్ చేసాడు. దీంతో విజయ్ ని హారర్ సినిమాల్లో చూడలేము అని, విజయ్ నుంచి హారర్ సినిమాలు రావని ఫిక్స్ అవుతున్నారు అభిమానులు. ఇప్పుడైతే ఇలా చెప్పాడు, మరి తర్వాత అభిప్రాయం మార్చుకుంటాడేమో చూడాలి.