Vijay-Rashmika: అనంతపురంలో ‘విజయ్- రష్మిక’ సందడి.. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
రణబాలి షూటింగ్ కోసం అనంతపూర్ వచ్చిన విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా(Vijay-Rashmika).
Vijay- Rashmika arrive Anantapur forRanabaali movie shoot
- అనంతపురం వచ్చిన ‘విజయ్- రష్మిక’
- ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
- రణబాలి షూటింగ్ కోసం వచ్చిన కొత్త జంట
Vijay-Rashmika: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న గురువారం సాయంత్రం అనంతపురంలో సందడి చేశారు. వీరిద్దరూ కలిసి వస్తున్నారన్న సమాచారంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి తపోవనం వద్ద ఘనస్వాగతం పలికారు. అనంతరం ఈ జంట హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి, వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ్, రష్మికలను నేరుగా చూసేందుకు స్థానికులు పోటీ పడటంతో క్లాక్ టవర్ సర్కిల్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
Suyodhana: శ్రీరామనవమికి థ్రిల్ చేయనున్న ‘సుయోధన’.. కొత్త కథతో వస్తున్న ప్రియదర్శి
ప్రస్తుతం విజయ్- రష్మిక(Vijay-Rashmika) కలిసి ‘రణబాలి’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత ఈ జంట ముచ్చటగా మూడోసారి స్క్రీన్ పంచుకుంటుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ అనంతపురం పరిసర ప్రాంతాల్లో జరగనున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇక్కడకు చేరుకుంది. వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసిన ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

